తెలంగాణలో మొత్తం అధికారం ఒక కుటుంబం దగ్గరే ఉంది: ప్రధాని మోదీ

3 Oct, 2023 17:45 IST|Sakshi

PM Narendra Modi Nizamabad Tour Updates

5:02PM
ఇందూరు జనగర్జన సభా ప్రాంగణం వద్ద ప్రధాని మోదీ ప్రసంగం

ఇవాళ నేను వంద శాతం వాస్తవం చెప్పేందుకు వచ్చా
తాను కూడా ఎన్డీఏలో చేరతానని కేసీఆర్‌ అడిగాడు
ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెప్పాం
నేను అలసిపోయాను..  కేటీఆర్‌ బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు
మీరు ఏమైనా రాజులా.. యువరాజుని సీఎం చేయడానికి అని అడిగా
ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదని చెప్పా
ఎవరు అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పాను
కేసీఆర్‌ అవినీతి బాగోతాన్ని చెప్పాను
అదే ఆఖరి రోజు.. నా కళ్లలోకి చూసే ధైర్యం కేసీఆర్‌కు లేదు
కర్ణాటక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నేతలే కాంగ్రెస్‌కు డబ్బులు అందజేశారు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కంటే ముందు కేసీఆర్‌ నా కోసం పెద్ద పెద్ద పూలమాలలు తీసుకొచ్చేవారు
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ నాకు స్వాగతం పలికారు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఢిల్లీ వచ్చారు.. నాపై ప్రేమ కురిపించారు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలిచింది
జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత సీన్‌ మారిపోయింది
జీహెచ్‌ఎంసీలో తమకు మద్దతు ఇవ్వమని కేసీఆర్‌ కోరాడు
 

మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు సలామ్‌
సర్దార్‌ పటేల్‌ తెలంగాణకు నిజాం పాలన నుండి విముక్తి కల్పించారు
గుజరాతీ అయిన పటేల్‌ తెలంగాణకు నిజాం పాలన నుండి విముక్తి కల్పించారు.
ఇప్పుడు మరో గుజరాతీ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని లూటీ స్వామ్యంగా మార్చేశారు
భారత్‌ లాంటి దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రాముఖ్యత ఉండాలి
కుటుంబ పాలన ప్రాముఖ్యత కాదు..
తెలంగాణలో మొత్తం అధికారం ఒక కుటుంబం దగ్గరే ఉంది
కుటుంబ పాలన వల్ల నష్టపోయేది యువతే
తెలంగాణ వల్ల కేసీఆర్‌, కేసీఆర్‌ కొడుకు, కేసీఆర్‌ కూతురు, కేసీఆర్‌ అల్లుడు మాత్రమే లబ్ధిపొందుతున్నారు.

మీ ఉత్సాహం చూస్తుంటే మనసు ఉప్పొంగి పోతుంది
తెలంగాణలో ఎక్కడ చూసినా టాలెంట్‌ ఉంది
కరోనా కష్టకాలంలో తెలంగాణకే దేశానికి వ్యాక్సిన్‌ ఇచ్చింది

నేను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును నేనే ప్రారంభించాను
ఎన్టీపీసీ వల్ల తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం
రూ. 8 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించాను
ఇండియా కూటమి, కాంగ్రెస్‌ మహిళా బిల్లు పాస్‌ కాకుండా కుట్ర చేశారు
మహిళా బిల్లుకు మద్దతు అని చెబుతూ లోపల కుట్రలు చేశారు
గత్యంతరం లేకే విపక్షాలు మహిళా బిల్లుకు మద్దతిచ్చాయి
దేశ మహిళలు ఇచ్చిన శక్తి వల్లే నేను మహిళా బిల్లును పాస్‌ చేయగలిగాను
నిజామాబాద్‌ మహిళలు పెద్ద ఎత్తున వచ్చి నాకు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు

4:52PM
ఇందూరు జనగర్జన సభా ప్రాంగణం వద్ద కిషన్‌రెడ్డి ప్రసంగం
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ను ప్రజలు కోరుకోవటం లేదు
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బీజేపీని ప్రజలు కోరుకుంటున్నారు
త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ.. ఒక కుటుంబం పాలైంది
కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీఆర్‌ఎస్‌కు ఓటేసినట్లే
చాలు కేసీఆర్‌.. సెలవు కేసీఆర్‌
తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలను ప్రజలు కోరుకుంటున్నారు.
► గతంలో పసుపు బోర్డును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు
పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేశారు
ఇవాళ రూ. 8 వేల కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభించాం

4:36PM
నిజామాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌ షో
మోదీ.. మోదీ అంటూ మార్మోగుతున్న నిజామాబాద్‌
మోదీపై పూల వర్షం కురిపిస్తున్న ప్రజలు
ఓపెన్ టాప్ జీపులో ఇందూరు జనగర్జన సభకు మోదీ
పూల వర్షం కురిపించిన మహిళలు పసుపు రైతులు
మోదీ నినాదాలతో దద్దరిల్లిన సభా ప్రాంగణం

4:25PM
ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రసంగం ప్రారంభించిన మోదీ
మా ప్రభుత్వం శంకుస్థాపనలే కాదు.. వాటిని పూర్తి చేస్తుంది
ఇది మా వర్క్‌ కల్చర్‌
తెలంగాణ ప్రజల విద్యుత్‌ అవసరాలు తీర్చేందుకు మేము కృషి చేస్తున్నాం
మెరుగైన విద్యుత్‌ సరఫరా  అభివృద్ధికి ద్వారాలు తెరుస్తుంది
త్వరలో భారతీయ రైల్వే 100 శాతం ఎలక్ట్రిఫికేషన్‌ అవుతుంది
బీబీ నగర్‌లో నిర్మిస్తున్న ఎయిమ్స్‌ భవనాన్ని మీరు చూస్తున్నారు

4:15PM
మొత్తం రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌  విభాగాలకు శంకుస్థాపన
సిద్దిపేట–సికింద్రాబాద్‌ వరకు తొలి రైలు సర్వీసును వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
సిద్దిపేట–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ను ప్రారంభించిన మోదీ
(ధర్మాబాద్‌ మహారాష్ట్ర)–­మనోహరాబాద్‌–మహబూబ్‌నగర్‌–కర్నూల్‌(ఏపీ)’ రైల్వేలైన్‌లో రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల మేర చేపట్టిన విద్యుదీకరణ పనులను జాతికి అంకితం
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల తొలి యూనిట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

4:10PM
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం: కిషన్ రెడ్డి
పసుపు బోర్డు ప్రకటించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన కిషన్‌రెడ్డి

03:53PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజామాబాద్‌కు చేరుకున్నారు. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణలో పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి గవర్నర్‌ తమిళసై, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డిలు స్వాగతం పలికారు.

కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి నిజామాబాద్ జిల్లాకు రాక. 
ప్రధాని మోదీ. జిల్లాలో రూ.8 వేల కోట్ల విలువైన పనులకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
అనంతరం జరిగే బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం చేయనున్న మోదీ. 

► కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో మోదీ రెండోసారి పర్యటిస్తున్నారు. ఈ నెల 1న మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపిన ప్రధాని.. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించే కార్య­క్రమాల్లో పాల్గొననున్నారు. తర్వాత ఇక్కడి గిరిరాజ్‌ కాలేజీ మైదానంలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం చేయనున్నారు. పాలమూరు పర్యట­నలో బీఆర్‌ఎస్, ఎంఐఎంలపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ.. నిజామా­బాద్‌­లో ఏం మాట్లాడుతారు, ఎలాంటి విమ­ర్శలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

► ఇప్పటికే ఇందూరుకు ప్రధాని  పసుపు బోర్డు ప్రకటించిన నేపథ్యంలో నిజామాబాద్‌ సభకు హాజరై కృతజ్ఞతలు చెప్తామని పసుపు రైతులు చెబుతున్నారు. దీనికి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల నుంచి పసుపు రైతులు భారీగా తరలిరానున్నారు.
చదవండి: రాష్ట్రంలో కారు జోరు.. 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు బీఆర్‌ఎస్‌కే.. 

మరిన్ని వార్తలు