హోంగార్డులను స్టేషన్‌లోనే ఉంచండి  | Sakshi
Sakshi News home page

హోంగార్డులను స్టేషన్‌లోనే ఉంచండి 

Published Sat, Sep 9 2023 3:43 AM

Police officer audio goes viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హోంగార్డు రవీందర్‌ మృతి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోంగార్డులకు పోలీస్‌ ఉన్నతాధికారులు వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలిసింది. హోంగార్డులంతా డ్యూటీలోనే ఉండాలని, డ్యూటీ అయిపోయిన వారిని కూడా పోలీస్‌ స్టేషన్లకే పరిమితం చేయాలని హుకుం జారీ చేసినట్టు ఓ ఆడియో వైరల్‌ అయ్యింది. రవీందర్‌ మృతికి నిరసనగా ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీస్‌ ఉన్నతాధికారులు అప్రమత్తం అయినట్టు తెలిసింది. ఆదేశాలు మీరితే విధుల నుంచి బహిష్కరణకు గురవుతారని ఓ దశలో బెదిరింపు ధోరణిలో హెచ్చరించినట్టు తెలిసింది. 

’రెస్ట్‌ ఉంది కదా.. ఇంటికి పోతాం అంటే కుదరదు’ 
‘విధుల్లో ఉండే హోంగార్డులు, డ్రైవర్లు, ఆఫీసర్ల దగ్గర పనిచేసే వాళ్లయినా, డే డ్యూటీ చేసేవాళ్లు, ఇంకే డ్యూటీలో ఉండేవాళ్లయినా సరే ప్రతి ఒక్కరూ ఈ రోజు పోలీస్‌ స్టేషన్‌లోనే ఉండాలి. స్టేషన్‌ వదిలి బయటికి వెళ్లకూడదు. డ్యూటీ అయిపోయిన వాళ్లను కూడా పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచండి..రెస్ట్‌ ఉంది కదా.. ఇంటికి పోతాం అంటే కుదరదు. ఎవరెవరైతే ఆబ్సెంట్‌లో ఉన్నారో వాళ్ల పేర్లు రాసి పెట్టండి. పది నిమిషాల తర్వాత మళ్లీ నాకు చెప్పండి.

ఎవరైతే ఆబ్సెంట్‌ అవుతారో వాళ్లను మిస్‌కండక్ట్‌ కింద తీసుకోబడుతుంది. వాళ్ల ఉద్యోగానికి కూడా ఎఫెక్ట్‌ పడుతుంది. ఇది ఆఫీసర్ల ఇన్‌స్ట్రక్షన్‌. అందరికీ పేరు పేరున ఫోన్‌ చేసి తెలపండి. ఇది మీ రెస్పాన్సిబిలిటీ...’అని ఓ పోలీస్‌ అధికారి సెట్‌లో ఆదేశాలిస్తున్న ఆడియో ఒకటి శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉన్నతాధికారుల ఒత్తిళ్లపై బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నా...హోంగార్డులు అంతర్గతంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.  

కుట్రతోనే డీఎంకే వ్యాఖ్యలు: పొంగులేటి 
సాక్షి, హైదరాబాద్‌: రాజకీయకుట్రలో భాగంగా, తమ ప్రభుత్వ వైఫల్యాల నుంచి, మంత్రులపై ఉన్న అవినీతి, ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే అధికార డీఎంకే గందరగోళం సృష్టిస్తోందని బీజేపీ నేత తమిళనాడు సహ ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు.

ఉదయనిధిస్టాలిన్‌ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. స్టాలిన్‌తో పాటు కేంద్రమాజీమంత్రి ఎం.రాజాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ...తాను యజ్ఞయాగాలకు కేరాఫ్‌ అని చెప్పుకునే సీఎం కేసీఆర్, ఉదయనిధి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.   

Advertisement
Advertisement