గుర్తిద్దాం... నివారిద్దాం | Sakshi
Sakshi News home page

గుర్తిద్దాం... నివారిద్దాం

Published Sun, Feb 25 2024 3:13 AM

Prevention is more important than treatment for cancer: Dr Guru N Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేన్సర్‌ మహమ్మారికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా చికిత్స అందించడం కన్నా నివారణ మార్గాలే అత్యంత ప్రామాణికమని కాంటినెంటల్‌ ఆస్పత్రి వ్యవస్థాపకుడు, చైర్మన్‌ డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి తెలిపారు. ఒకే రక్త పరీక్షతో కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించేలా కాంటినెంటల్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో నూతనంగా ‘కేన్సర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ ఎర్లీ కేన్సర్‌ డిటెక్షన్‌’విభాగాన్ని ఏర్పాటు చేశారు.

శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్‌ స్పెషలిస్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్‌ ప్రోగ్రామ్‌ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కరోల్‌ సికోరా ఈ విభాగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే ప్రఖ్యాత కేన్సర్‌ సెంటర్‌ ఎండీ అండర్సన్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో 40 ఏళ్ల పాటు పనిచేసి, ఆ అనుభవాన్నంతా దేశంలోనే సేవలందించాలనే లక్ష్యంతో కాంటినెంటల్‌ ఆసుపత్రిని స్థాపించానని తెలిపారు. ఇప్పటికే 40 వేల మందిని పైగా కేన్సర్‌ కోరల నుంచి బయటికి తీసుకొచ్చిన తమ కేన్సర్‌ కేర్‌ టీమ్‌... రాబోయే రోజుల్లో ఈ బ్లడ్‌ టెస్ట్‌ ద్వారా మరింత ఎక్కువ మందిని కేన్సర్‌ బారి నుంచి కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. 

లిక్విడ్‌ బయాప్సీ టెస్ట్‌తో కేన్సర్‌ గుర్తింపు 
ముంబయిలోని టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌ వంటి సంస్థల్లో కేన్సర్‌ విభాగంలో 40 ఏళ్లపాటు సేవలందించిన డాక్టర్‌ జగన్నాథ్‌ నిర్వహణలో కేన్స ర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ ఎర్లీ కేన్సర్‌ డిటెక్షన్‌ విభాగం కొనసాగుతుందని గురు ఎన్‌ రెడ్డి తెలిపారు. ఇందులో భాగమైన లిక్వి డ్‌ బయాప్సీ టెస్ట్‌తో ముందుగా కేన్సర్‌ను గుర్తించే సామర్థ్యాన్ని అందిస్తుందన్నారు. 

ఈ మూడు టెస్ట్‌లతో...  
ఆస్పత్రిలో మూడు రకాల జన్యు పరీక్షలను ప్రారంభించామని డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి తెలిపారు మొదటగా కేన్సర్‌ ప్రిడిస్పోజిషన్‌ టెస్ట్‌... జన్యు అమరిక, వాటిలోని తేడాలను అర్థం చేసుకుని, భవిష్యత్‌లో ఏ రకమైన కేన్సర్‌ వ్యాధి బారిన పడతామో ముందుగానే గుర్తిస్తుందన్నారు.  

రెండోది కేన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌.. వంశపారంపర్యంగా వచ్చే కేన్సర్లను గుర్తించడానికి ఈ కేన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ జెనెటిక్‌ మేకప్‌ను సమగ్రంగా పరిశీలిస్తుందన్నారు. యూఎస్‌ఏలోని నేషనల్‌ కాంప్రహెన్సివ్‌ కేన్సర్‌ పేర్కొన్న విధంగా... రొమ్ము కేన్సర్, ఓవరిన్‌ కేన్సర్, పాంక్రియాటిక్‌ కేన్సర్, ప్రొస్టేట్‌ కేన్సర్, కొలొరెక్టల్‌ కేన్సర్‌ వంటి ఐదు కేన్సర్లకు కారణం అయ్యే వంశపారంపర్యంగా వచ్చే జన్యువులను ఈ టెస్ట్‌ ద్వారా గుర్తించవచ్చన్నారు. 

మూడోది నెక్స్ట్‌ – జనరేషన్‌ సీక్వెన్సింగ్‌ (ఎన్‌జీఎస్‌) ఆధారిత సీఎఫ్‌డీఎన్‌ఏ పరీక్ష. దీని ద్వారా రక్త ప్రవాహంలో తిరుగుతున్న సెల్‌ ఫ్రీ డీఎన్‌ఏను విశ్లేషించి కేన్స ర్‌ను చాలా ముందుగా గుర్తించవచ్చన్నారు. ఇలా 3 దశల్లో జన్యువులోని కేన్సర్‌ బారినపడ్డ, పడబోతున్న ప్రాంతాలను ఈ రక్త పరీక్ష ద్వారా చాలా కచ్చితత్వంతో తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సమగ్ర విశ్లేషణతో కేన్స ర్‌ చికిత్స మరింత సులభతరం అవుతుందన్నారు. 

అపోహలను తొలగించాలి: కరోల్‌ సికోరా 
ప్రొఫెసర్‌ కరోల్‌ సికోరా మాట్లాడుతూ... కేన్సర్‌ నివారించడం సాధ్యమేనా అనుకునే అపోహలను ప్రయత్నమనే ఒక్క అడుగుతో తొలగించవచ్చన్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రయత్నాన్ని మొదలుపెట్టిన కాంటినెంటల్‌ ఆసుపత్రికి ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంటినెంటల్‌ కేన్సర్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జగన్నాధ్, డాక్టర్‌ రవీంద్రనాథన్, డాక్టర్‌ ఏవీ సురేష్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. 

అవగాహనతో భయాందోళనలు తొలగింపు..
కేన్సర్‌ను ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయని అందుకే వీటిపై అవగాహన కల్పించడానికి కాంటినెంటల్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి వెల్లడించారు. ఆస్పత్రి వైద్యుల నేతృత్వంలో ఫిబ్రవరి నెలలో వందలాది మందికి అవగాహన కల్పించామని చెప్పారు. ఆడవారిలో వచ్చే కేన్సర్‌లు, లక్షణాలు, జాగ్రత్తలపైన, గ్యాస్ట్రో ఇంటస్టైన్, లివర్‌ కేన్సర్‌లపైన ఊపిరితిత్తులు, తల, మెడ కేన్సర్లు, గ్లాడర్, కిడ్నీ, ప్రొస్టేట్, చర్మ కేన్సర్ల పైన అవగాహన కల్పి ంచామన్నారు. మంచి చికిత్సను అందించడమే కాకుండా కేన్సర్‌ రాకుండా అవగాహన కల్పించడం బాధ్యతగా అలవర్చుకున్నామన్నారు. ఇన్సూరెన్స్‌ సంస్థలు వారి సేవల్లో కేన్సర్‌ బాధితులను చేర్చాల్సిన అవసరముందని, 70 శాతం మంది బాధితులు ఆర్థిక సమస్యలతోనే మరణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement