‘టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు కోర్టు తీర్పుకు లోబడే ఉండాలి’ | Promotions And Transfers Of Teachers Should Be Subject To Court Judgment, Sabitha Indra Reddy - Sakshi
Sakshi News home page

‘టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు కోర్టు తీర్పుకు లోబడే ఉండాలి’

Published Thu, Aug 31 2023 5:43 PM

Promotions and transfers of teachers should be subject to court judgment - Sakshi

హైదరాబాద్‌:  ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను కోర్టు తీర్పుకు లోబడి నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో గురువారం నడాఉ ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. 

‘పూర్తి పారదర్శకతతో ఎలాంటి అపోహలకు తావులేకుండా  పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలి. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాశాఖ తరఫున వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపాలి. ఆన్‌లైన్‌ ప్రక్రియలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. జిల్లాల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారాలను ఆయా జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు సాఫీగా జరిగేలా చూడాలి’ అని మంత్రి సబితా ఆదేశించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement