Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

3 Oct, 2022 10:00 IST|Sakshi

1. గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్‌.. హనీ వైద్యం కోసం రూ.కోటి మంజూరు
ఓ చిన్నారి ప్రాణాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీరామరక్షలా నిలిచారు. ఆమెకు సోకిన అరుదైన వ్యాధి వైద్యానికి లక్షలాది రూపాయల ఖర్చును జీవితాంతం భరిస్తానని భరోసా ఇచ్చారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. అబద్ధాలే.. రామోజీకి నిత్యావసరం!
నిత్యం అబద్ధాలాడటం... రామోజీరావుకు నిత్యావసరం!!. చంద్రబాబు నాయుడు ఐదేళ్లూ ఏమీ చేయకపోయినా... అదో గుప్తుల కాలం నాటి స్వర్ణయుగంలా రోజూ కీర్తిస్తే జనాన్ని కొంతయినా నమ్మించగలమనేది ఆయన దింపుడు కళ్లం ఆశ.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. కలల కొలువు సులువే
పోటీ ప్రపంచంలో ఇప్పుడంతా ఆన్‌లైన్‌ మయం. ఇందులో ముందుండాలంటే మిగిలిన వారితో పోలిస్తే భిన్న ప్రతిభా పాటవాలు అవసరం. తాము చదువుకున్న కోర్సుకు సంబంధించి అదనపు నైపుణ్యాలు ఉన్న వారికే కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. టీఆర్‌ఎస్‌ నేతలపై గోనె ప్రకాశ్‌రావు సంచలన వ్యాఖ్యలు 
టీఆర్‌ఎస్‌ పాలనలో ఎంపీటీసీలు మొదలు.. ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అవినీతి అడ్డూఅదుపు లేకుండా పోయిందని, అందుకే మావోయిస్టుల హెచ్చరికలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాశ్‌రావు అన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. దశమి రోజు ధ్వంస రచనకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు
దసరా రోజున హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి పాకిస్తాన్‌ కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్రను కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో నగర పోలీసులు భగ్నం చేశా రు. లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది ఫర్హాతుల్లా ఘోరీ ఆదేశాలతో నగరంలో దసరా ఉత్సవాలు, ఊరేగింపుల్లో విధ్వంసాలు సృష్టించడంతోపాటు నగరానికి చెందిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల్ని హతమార్చాలనుకున్న ముగ్గురు ముష్కరులను అరెస్టు చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. గుజరాత్‌లో అధికారం బీజేపీకే.. ఆప్‌కు రెండు సీట్లే!
గుజరాత్‌లో అధికార పీఠాన్ని మళ్లీ బీజేపీ దక్కించుకోనుందని ఏబీపీ న్యూస్‌–సీ ఓటర్‌ ఒపీనియన్‌ పోల్‌ ఆదివారం వెల్లడించింది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ సంవత్సరం ఆఖర్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి 135–143 సీట్లు వస్తాయని ఒపీనియన్‌ పోల్‌ తెలియజేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. పోరాటాలకు సిద్ధం కావాలి
రాబోయే కాలంలో అతిపెద్ద పోరాటాలకు, ఊహించని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్ట్‌ పార్టీ ఇప్పటినుంచే సంసిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా వ్యవహరించాలని సూచించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. స్వదేశంలో టీమిండియా కొత్త చరిత్ర..
స్వదేశంలో సౌతాఫ్రికాపై టి20 సిరీస్‌ గెలవలేదన్న అపవాదును టీమిండియా చెరిపేసింది. ఆదివారం గుహవటి వేదికగా జరిగిన రెండో టి20లో పరుగుల జడివానలో టీమిండియా 16 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. మహేశ్‌-త్రివిక్రమ్‌ చిత్రంలో మలయాళ స్టార్‌ హీరో!
తెలుగు సినిమాలపై మరింత ఫోకస్‌ పెట్టినట్లున్నారు మలయాళ దర్శక-నిర్మాత, నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ఇప్పటికే ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్‌’ చిత్రంలో పృథ్వీరాజ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. Suzlon Energy: ‘సుజ్లాన్‌’ తులసి తంతి తుది శ్వాస
పవన విద్యుత్‌ రంగ దిగ్గజం సుజ్లాన్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు, విండ్‌ మ్యాన్‌గా పేరొందిన తులసి తంతి (64) కన్నుమూశారు. ఆయన శనివారం గుండెపోటుతో మరణించినట్లు స్టాక్‌ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. తులసి తంతికి భార్య (గీత), ఇద్దరు సంతానం (కుమారుడు ప్రణవ్, కుమార్తె నిధి) ఉన్నారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు