దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్‌టీపీసీ పాత్ర కీలకం 

9 Nov, 2021 03:27 IST|Sakshi

ఎన్‌టీపీసీ సీజీఎం శైలేష్‌ శ్రీనివాసన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్‌టీపీసీ పాత్ర కీలకమైనదని ఆ సంస్థ సీజీఎం(ఐటీ) శైలేష్‌ శ్రీనివాసన్‌ అన్నారు. 46 ఏళ్ల ప్రస్థానంలో నిరంతర విద్యుత్‌ సరఫరాతో ఎన్‌టీపీసీ దేశంలో స్ఫూర్తిదాయక సంస్థగా కొనసాగుతుందన్నారు. సంస్థ సదరన్‌ రీజియన్‌ క్వార్టర్స్‌లో ‘ఎన్‌టీపీసీ రైజింగ్‌డే –2021’ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శైలేష్‌ శ్రీనివాసన్‌ జెండాను ఎగరవేసి మాట్లాడారు.

కరోనా  విజృంభించిన సమయంలోనూ సంస్థ మంచి పనితీరును కనబరించిందని కితాబిచ్చారు. దక్షిణ ప్రాంతంలోని ఎన్‌టీపీసీ పవర్‌ ప్లాంట్ల పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్‌టీపీసీ ప్రాజెక్టు, సోలార్‌ పీవీ ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. అనం తరం ‘హిందీ పక్వాడా’, ‘విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌’ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీ ల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌టీపీసీ జీఎం మణికాంత్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు