ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పరీక్షలు | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పరీక్షలు

Published Thu, Dec 29 2022 3:16 AM

SSC Exams Likely To Start From April 3 In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇవి ఏప్రిల్‌ 13వ తేదీ వరకూ కొనసాగుతాయి. బుధవారం రాష్ట్ర పరీక్షల విభాగం దీనికి సంబంధించిన టైమ్‌ టేబుల్, ఇతర విధివిధానా లను విడుదల చేసింది. అలాగే పరీక్షల్లో ఇప్పటి వరకు ఉన్న 11 పేపర్ల విధానా నికి బదులు ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా మార్పులు చేస్తూ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జారీ చేశారు.

టెన్త్‌తో పాటు 9వ తరగతి సమ్మేటివ్‌ అసెస్‌ మెంట్‌–2 కూడా 6 పేపర్లతోనే నిర్వ హించనున్నట్టు జీవోలో పేర్కొ న్నారు. ప్రతీ సబ్జెక్టులోనూ వంద మార్కులుంటాయి. 4 ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీ క్షల నుంచి 20 మార్కులు, పబ్లిక్‌ పరీ క్షలో 80 మార్కులు ఉంటాయి. మొత్తం ఆరు సబ్జెక్టులకు ఎఫ్‌ఏల ద్వారా 120 మార్కులు, పబ్లిక్‌ పరీక్షల ద్వారా 480.. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది.

సైన్స్‌ మినహా అన్ని సబ్జెక్టుల పరీక్షలకు 3 గంటల వ్యవధి ఉంటుంది. సైన్స్‌లో మాత్రం బయలాజి క ల్‌ సైన్స్, ఫిజికల్‌ సైన్స్‌.. 2 పేపర్లుగా విభజించా రు. ఒక్కో పేపర్‌కు గంట న్నర వ్యవధి ఇస్తారు. మొదటి పేపర్‌ పరీక్ష జరిగిన తర్వాత ఆ సమాధాన పత్రాల సేకర ణకు అదనంగా 20 నిమి షాలు ఇస్తా రు. అంటే సైన్స్‌ 2 పేపర్ల పరీక్ష వ్యవధి 3.20 గంటలు ఉంటుంది. ఓరియంటల్‌ సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌  పరీక్షల్లో సంస్కృతం పేపర్‌–1, పేపర్‌–2గా ఒక్కొక్కటి 200 మార్కులకు ఉంటుంది. 

ఇదీ టెన్త్‌ టైమ్‌ టేబుల్‌... 

వంద శాతం సిలబస్‌తో పరీక్షలు: మంత్రి సబిత
ఈ సారి టెన్త్‌ పరీక్షలను వంద శాతం సిలబస్‌తో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబిత తెలిపారు. పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్న లకు మాత్రమే ఇంటర్నల్‌ చాయిస్‌ ఉంటుందని, సూక్ష్మరూప ప్రశ్నలకు చాయిస్‌ లేదని ఆమె వెల్లడించారు. టెన్త్‌ పరీక్షల నిర్వహణపై బుధవారం మంత్రి విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు.

టెన్త్‌ పరీక్షలకు సంబంధించి నమూనా ప్రశ్న పత్రాలను వెంటనే విద్యార్థులకు అందు బాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వాటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయా లని సూచించారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వ హించాలని పేర్కొ న్నారు.

ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన వారిని గుర్తించి ఆ విద్యార్థులకు ప్రత్యేక బోధన చేయాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రీ ఫైనల్స్‌ నిర్వహించాలని స్పష్టంచేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకో వాలని కోరారు. ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరు ణ, పాఠశాల విద్యా సంచాలకు రాలు దేవసేన, ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు కృష్ణారావు తదితరు లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

Advertisement
Advertisement