ఆగస్టు 1 తరువాతే అమెరికా ఎంట్రీ

5 May, 2021 01:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులను ఆగస్టు తరువాతే తమ దేశంలోకి అనుమతిస్తామని హైదరాబాద్‌ కాన్సులేట్‌ తెలిపింది. మంగళవారం ఈ మేరకు అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్లో ఓ ప్రకటన జారీ చేసింది. కరోనా వైరస్‌ కట్టడికి అమెరికా అధ్యక్షుడు విధించిన నిబంధనలు అమలులో ఉన్న కారణంగా విదేశీ విద్యార్థులందరికీ ఆగస్టు 1 తరువాత మాత్రమే తమ దేశంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థి వీసా (ఎఫ్‌)లు పొందినప్పటికీ ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి చెందే ముప్పు ఉండటంతో వారిని దేశంలోకి అనుమతించలేమని వివరించింది. భారత్‌తోపాటు చైనా, ఇరాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విద్యార్థులకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయంది. ఆగస్టు 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యక్తిగత మినహాయింపు కోరుతూ అమెరికన్‌ ఎంబసీని ఆశ్రయించాల్సిన అవసరం లేదంది. 

చదవండి:
భారత్‌లో పరిస్థితి తీవ్ర ఆందోళనగా ఉంది.. సైన్యాన్ని దించండి

భారత్‌లో కరోనా పరిస్థితి విషాదకరం.. ప్రజలకు అండగా ఉంటాం 

మరిన్ని వార్తలు