తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

Published Thu, Nov 2 2023 7:34 AM

Telangana Assembly Elections: November 2st Updates - Sakshi

Telangana Politics & Election Updates:

2nd Nov 2023, 07:20PM

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కేటీఆర్

►తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఇండియా పప్పు రాహుల్ గాంధీ 
►వీళ్ళిద్దరూ ఎగేసికొని పోయి కాళేశ్వరం చూసి వచ్చారు
►మహా ఇంజనీర్లు వీళ్ళు.. బ్రిడ్జి కూలిపోతుంది అని ప్రచారం చేస్తున్నారు
►ఎక్స్పానషన్ లెవల్‌ను చూపిస్తూ కాళేశ్వరం బ్రిడ్జి కూలిపోతుంది అంటూ ఫోటోలు పెడుతున్నారు. ఇది వీళ్ళ అవగాహన
►జనాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీలోని ఈ చిల్లర గాళ్ళు
►రాష్ట్రానికి వరం కాళేశ్వరం, దేశానికి శనిశ్వరం కాంగ్రెస్ పార్టీ

2nd Nov 2023, 07:00PM
ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్..
►అనేక మంది యువకుల బలిదానం ఫలితం తెలంగాణ రాష్ట్రం
►తెలంగాణా ఆత్మ గౌరవం కాపాడాలని రాష్ట్రం కోసం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు..
►గారడీ మాటలతో అనేక మాటలు చెప్పి రెండు సార్లు కేసీఆర్ పరిపాలించారు.
►పది సంవత్సరాలో కేసీఆర్ ఐదు లక్షల కోట్ల అప్పు చేశాడు.
► టీఎస్‌పీఎస్సీ ద్వారా రెండు సార్లు పరీక్షలు పెట్టి పేపర్లు అమ్ముకుని యువకులను బలి తీసుకుంది కల్వకుంట్ల కుటుంబం.
►కాళేశ్వరంలో రెండు ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టు 150 మీటర్లు కుంగి పోయింది.
►కాళేశ్వరం ప్రాజెక్టు ను ఏటీఎం వాడుకుందన్న బీజేపీ ఒక్కసారి కూడా ప్రశ్నిచలేదు..ఇక్కడే బీజేపీ, బీఆర్‌ఎస్‌ దోస్తీ తెలుస్తుంది.
►హస్తం గుర్తు పై ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైన నన్ను గెలిపించండి..

2nd Nov 2023, 5:40PM
తెలుగుదేశం మీకో దండం..
►చంద్రబాబు, లోకేష్‌ల నుంచి బయటకొచ్చేసిన కాసాని
►రేపు ఉదయం బీఆర్‌ఎస్‌లో  చేరనున్న కాసాని
►గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక
►తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులుగా రెండు రోజుల క్రితం వరకు పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

2nd Nov 2023, 4:30PM
జనసేన, బీజేపీ పొత్తు అంశంపై రచ్చ
►నిరసనలతో అట్టుడికిన బీజేపీ రాష్ట్ర కార్యాలయం
►నాగర్‌ కర్నూల్‌ టికెట్‌ .జనసేనకు కేటాయిస్తారని ప్రచారం
►నిరసనకు దిగిన  నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి దిలీపాచారి, ఆయన అనుచరులు
►జనసేన వద్దు.. బీజేపీ ముద్దు అంటూ నినాదాలు
► జనసేన అసలు తెలంగాణలోనే లేదని అలాంటప్పుడు టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ఆగ్రహం

2nd Nov 2023, 4:00PM
►కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న సీపీఎం
►తెలంగాణలో 17 స్ధానాల్లో పోటీ చేయనున్న సీపీఎం
►తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి సీపీఎం
►పోటీ చేయనున్న స్ధానాల పేర్లు ప్రకటించిన  సీపీఎం
►భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, మధిర సత్తుపల్లి, ఖమ్మం, వైరా, మిర్యాలగూడ, నల్గొండలో సీపీఎం పోటీ

2nd Nov 2023, 2:53PM
►బీజేపీ మూడో జాబితాలో దత్తాత్రేయ కుమార్తెకు మొండిచేయి 
►ముషీరాబాద్ టికెట్‌ను పూస రాజుకు కేటాయించిన బీజేపీ

2nd Nov 2023, 2:30PM
35 మంది అభ్యర్థులతో బీజేపీ మూడో జాబితా  విడుదల

1. నిజామాబాద్‌ రూరల్‌ దినేష్‌
2. రాజేంద్రనగర్‌-శ్రీనివాస్‌ రెడ్డి, 
3. ఆందోల్‌- బాబూమోహన్‌
4. జహీరాబాద్‌- రామచంద్ర రాజనర్సింహా
5. చేవేళ్ల-కేఎస్‌ రత్నం
6. బోథన్‌- మోహన్‌రెడ్డి
7.బాన్సువాడ- యెండల లక్ష్మీనారాయణ
8. పరిగి- మారుతి కిరణ్‌
9.ముషీరాబాద్‌-పూస రాజు
10. జడ్చర్ల- చిత్తరంజన్‌ దాస్‌
11.మక్తల్‌ - జలంధర్‌ రెడ్డి
12. రాజేంద్ర నగర్‌- తోకల శ్రీనివాసరెడ్డి
13.సనత్‌ నగర్‌- మర్రి శశిధర్‌ రెడ్డి
14.మంథని- చందుపట్ల సునీల్‌ రెడ్డి
15. ఉప్పల్‌- ఎన్‌బీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌,
16. లాల్‌బహదూర్‌ నగర్‌- సామరంగారెడ్డి
17.దేవరకొండ- లాలూ నాయక్‌
18. చల్లా శ్రీలతా రెడ్డి
19. నారాయణ్‌పేట-రతన్‌ పాండురంగారెడ్డి
20. మలక్‌పేట- శ్యామ్‌రెడ్డి సురేందర్‌ రెడ్డి
21. అంబర్‌పేట్‌-కృష్ణ యాదవ్‌
22. షాద్‌నగర్‌- అందె బాబయ్య,
23. వనపర్తి- అశ్వద్ధామరెడ్డి,
24. అచ్చంపేట్‌- దేవని సతీష్‌ మాదిగ
25.సత్తుపల్లి(ఎస్సీ)-రామలింగేశ్వరరావు
26.సికింద్రాబాద్‌- మేకల సారంగపాణి
27. నారాయణపేట్‌- కేఆర్‌. పాండురెడ్డి
28. మెదక్‌- పంజా విజయ్‌ కుమార్‌
29.నారాయణఖేడ్‌ -సంగప్ప
30. మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్‌
31. అసిఫాబాద్‌(ఎస్టీ) అజ్మీరా ఆత్మరాం నాయక్‌
32. జూబ్లీహిల్స్‌: లంకల దీపక్‌ రెడ్డి
33. ఆలేరు- పడాల శ్రీనివాస్‌
34.నల్గొండ- మడగాని శ్రీనివాస్‌ గౌడ్‌
35 పరకాల్‌- కాలి ప్రసాద్‌రావు

2nd Nov 2023, 2.10 pm
తెలంగాణకు భారీగా ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు
► తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు
► ఇవాళ హైదరాబాద్ చేరుకొనున్న ఎమ్మెల్యేలు
► మహారాష్ట్ర, కర్నాటక, గోవా నుంచి 150 ఎమ్మెల్యేలు
► అన్నిజిల్లాలకు ఇంచార్జులుగా ఎమ్మెల్యేలు

2nd Nov 2023, 1.55 pm
ఒక్క కేసీఆర్ ను కొట్టడానికి ఇంత మందా:కేటీఆర్

► హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర సహకారం లేదు
► కిషన్ రెడ్డి ఫోటో పోజులకు తప్ప చేసిన పని ఏమి లేదు
► వర్షాలు వరదల వచ్చిన కనీసం జనాల ఇబ్బందులు కిషన్ రెడ్డి కి పట్టవు
► ఉప్పల్ ఫ్లై ఓవర్ కట్టడానికి కూడా బీజేపీకి కనీసం చేతకావటం లేదు
► బిజెపి, కాంగ్రెస్ పహిల్వాన్ లు తెలంగాణ లో దిగుతున్నారు
► బక్క పల్చని కేసిఆర్ ను కొట్టడానికి ఇంత మంది వస్తున్నారు
►డిక్కీ బలిసిన కోడి తొడ కొట్టినట్టు రేవంత్ రెడ్డి తీరు ఉంది

2nd Nov 2023, 1.40 pm
తెలంగాణ బీజేపీకి పక్కరాష్ట్రాల ఎమ్మెల్యేలు
►నేటినుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు
►ఇవాళ హైదరాబాద్ చేరుకొనున్న  ఎమ్మెల్యేలు
►మహారాష్ట్ర, కర్నాటక, గోవా నుంచి 150 ఎమ్మెల్యేలు
►అన్నిజిల్లాలకు ఇంచార్జులుగా ఎమ్మెల్యేలు

2nd Nov 2023, 1.20 pm
మాటలు vs ముఠాల మధ్య పోరు: హరీష్‌ రావు
►మల్కాజ్ గిరి ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు
►ఇక్కడ ఎన్నికలు మంచి మనసున్న మనిషి, మాటలు, ముఠాల మనిషి మధ్య పోటీ
►మైనంపల్లి స్వార్థం కోసం పార్టీ మారాడు. మెదక్, మల్కాజగిరి రెండు చోట్ల ఓడటం ఖాయం.
►కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా?
►9 ఏళ్ల తెలంగాణలో కరువు లేదు కర్ఫ్యూ లేదు. సీఎం  ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తున్నడు.
►అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి మోడల్ గా మారింది.
►మల్కాజ్ గిరి ప్రజలకు సీఎం గారు 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టిస్తున్నరు.
►28 రోజులు కష్టపడి రాజశేఖర్ రెడ్డిని గెలిపించండి. నేను దత్తత తీసుకొని అభివృద్ధికి బాధ్యత తీసుకుంటా.
►కర్ణాటకలో కుర్చీల కొట్లాట జరుగుతున్నది. ఒకర్ని దించాలే, మరొకరిని ఎక్కించాలి.
►కేసీఆర్ రాకుంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుంది.

2nd Nov 2023, 1.20 pm

కౌశిక్‌ ప్రచారం అంటే డాన్సే డాన్స్‌
►కరీంనగర్ జిల్లా :వీణవంక మండలం కనపర్తి గ్రామంలో ప్రచారం చేపట్టిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.
►కళ్యాణ లక్ష్మి, CMRF చెక్కులు ఇంటింటికి వచ్చి ఇచ్చా.
►కనపర్తిలో బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.కోటి రూపాయలు మంజూరు చేపించాం.
►గ్రామంలో రూ.కోటి 14లక్షలతో రోడ్లు వేసాం.
►తెలంగాణలో రూ.19వేల కోట్లు రుణమాఫీ చేసాం.
►మరో రూ.5వేల కోట్లు కూడా త్వరలో మాఫీ చేయబోతున్నాం.
►మీ దయ, దండం ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించండి.
►బిసి బంధు చెక్కులు కూడా వచ్చాయి.
►అందువల్లే బిసి బంధు చెక్కులు MRO హాండవర్ చేసుకున్నారు

2nd Nov 2023, 1.15 pm
స్మార్ట్‌ లేదంటే రిజైన్‌ : అరవింద్‌ రూటులో బీజేపీ అభ్యర్థి సంధ్యారాణి
► పెద్దపెల్లి జిల్లా:గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బీజేపీ ఆభ్యర్థి కందుల సంధ్యారాణి
►BRS, కాంగ్రెస్ అభ్యర్థులు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్‌లు పెడుతున్నారు
►చర్రితలో 33 శాతం మహిళలకు రిజ్వరేషన్ ఇచ్చిన ఘనత బీజేపీదే.
►నన్ను గెలిపిస్తే రామగుండంను స్మార్ట్ సిటీ చేస్తా
►నాకు అధికారం ఇవ్వండి.. స్మార్ట్ సిటీ విషయంలోఇచ్చిన మాట తప్పితే  6 నెలల్లో రాజీనామా చేస్తా
►బాండ్ పేపర్ మీద రాసి ఇస్తున్నా

2nd Nov 2023, 12.50 pm
ఎన్నికల వేళ మళ్లీ తెర మీదికి రూ.2వేల నోటు
► రిజర్వ్‌ బ్యాంకు వద్ద పెరిగిన రద్దీ
► ఆర్బీఐ శాఖల వద్దకు క్యూ కడుతున్న ప్రజలు
► రూ.2000 నోట్లు మార్చుకునేందుకు వస్తోన్న ప్రజలు
► అక్టోబర్ 7 నాటికి బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి ముగిసిన గడువు
► ఇప్పుడు కేవలం రిజర్వ్‌బ్యాంకు శాఖల వద్దే మార్చుకునేందుకు వీలు

2nd Nov 2023, 12.50 pm
కోమటిరెడ్డి ​​​​​బంధువు ఇంట్లో తనిఖీలు
► భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తోడల్లుడు గిరిధర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు
► హైద్రాబాద్ కోకాపెట్ హిడెన్ గార్డెన్ లోని గిరిధర్ రెడ్డి నివాసంలో అధికారుల సోదాలు
► ఉదయం నుండి  హైద్రాబాద్ నగరంలో పలువురిర ఇళ్లలో  ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు

2nd Nov 2023, 12.45 pm
నాగార్జునసాగర్‌లో బీజేపీకి షాక్‌
► నల్లగొండ జిల్లా : నాగార్జునా సాగర్ లో బీజేపీకి‌ షాక్
► పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి పదవికి రాజీనామా చేసిన రిక్కల ఇంద్రసేనారెడ్డి
► నాగార్జున సాగర్ టికెట్ ఆశించి రాకపోవడంతో నిరసగా పార్టీకి రాజీనామా
► సాగర్ అభ్యర్థిగా నివేదితను ప్రకటించడంతో ఆగ్రహంతో ఉన్న రిక్కల
► నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన రిక్కల
► గతంలో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డికి కుడిభుజంగా ఉన్న ఇంద్రసేనా రెడ్డి

2nd Nov 2023, 12.25 pm
బీజేపీ మూడో జాబితాలో ఉండేది వీరేనా?

01        ఆసిఫాబాద్       తుకారాం

02        చెన్నూరు         అందుగుల శ్రీనివాస్

03        మంచిర్యాల       రఘునాథబాబు

04        బాన్సువాడ       మాల్యాద్రి రెడ్డి

05        బోధన్            మేడపాటి ప్రకాశ్ రెడ్డి/వడ్డి మోహన్ రెడ్డి

06        నిజామాబాద్ రూరల్    దినేష్

07        ఎల్లారెడ్డి            పైళ్ల కృష్ణారెడ్డి

08        మంథని           చందుపట్ల సునీల్ రెడ్డి

09        పెద్దపల్లి            గొట్టిముక్కల సురేష్ రెడ్డి/ నల్ల మనోహర్ రెడ్డి/ దుగ్యాల ప్రదీప్ రావు/ గుజ్జుల రామకృష్ణారెడ్డి

10        వేములవాడ       తుల ఉమ/వికాస్ రావు

11        జహీరాబాద్        ఢిల్లీ వసంత్/దామోదర రామచంద్ర

 12        సంగారెడ్డి          దేశ్ పాండే/ పులిమామిడి రాజు

13        నారాయణ ఖేడ్     విజయపాల్ రెడ్డి/సంగప్ప

14        ఆందోల్           

15        మెదక్           

16        హుస్నాబాద్      బొమ్మ శ్రీరాంచక్రవర్తి/ జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి

17        సిద్దిపేట            దూది శ్రీకాంత్ రెడ్డి

18        షాద్ నగర్        విష్ణు వర్ధన్ రెడ్డి/ అందె బాబయ్య

19        ఎల్బీనగర్          సామ రంగారెడ్డి/ మధుసూదన్

20        రాజేంద్రనగర్        తోకల శ్రీనివాస్ రెడ్డి

21        శేరిలింగంపల్లి        రవి యాదవ్

22        చేవెళ్ల            కేఎస్ రత్నం

23        వికారాబాద్        

24        తాండూరు        రమేష్

25        కొడంగల్           చికోటి ప్రవీణ్ /  కొస్గి రమేష్

26        మేడ్చల్            విక్రమ్ రెడ్డి

27        మల్కాజ్ గిరి      ఆకుల రాజేందర్/ భాను ప్రకాశ్

28        కూకట్ పల్లి        జనసేన??

29        ఉప్పల్            వీరేందర్ గౌడ్/ NVS ప్రభాకర్

30        ముషీరాబాద్      బండారు విజయలక్ష్మి

31        మలక్ పేట        కొత్తకాపు రవీందర్ రెడ్డి

32        అంబర్ పేట        గౌతమ్ రావు

33        జూబ్లీహిల్స్        జూటూరి కీర్తిరెడ్డి

34        సనత్ నగర్        మర్రిశశిధర్ రెడ్డి

35        నాంపల్లి            విక్రమ్ గౌడ్

36        సికింద్రాబాద్       బండ కార్తీక రెడ్డి

37        కంటోన్మెంట్        సుష్మిత

38        జడ్చర్ల            చిత్తరంజన్ దాస్

39        దేవరకద్ర            పవన్ కుమార్ రెడ్డి

40        నాగర్ కర్నూల్     జనసేన ?

41        అచ్చంపేట          సతీశ్ మాదిగ

42        వనపర్తి            అశ్వద్ధామ రెడ్డి

43        గద్వాల            వీరబాబు

44        అలంపూర్       

45        నకిరేకల్          పాల్వాయి రజిని

46        నల్లగొండ        శ్రీనివాస్ గౌడ్

47        మునుగోడు      బూర నర్సయ్య గౌడ్

48        దేవరకొండ        లాలు నాయక్

49        మిర్యాల గూడ     సాదినేని శ్రీనివాస్

50        హుజూర్ నగర్     చల్ల శ్రీలత రెడ్డి

51        కోదాడ            జనసేన

52        తుంగతుర్తి        కడియం రామచంద్రయ్య

53        ఆలేరు            కాసం వెంకటేశ్వర్లు

54        నర్సంపేట         పుల్లారావు చౌదరి

55        పరకాల           కాళీ ప్రసాద్

56        పినపాక     

57        కొత్తగూడెం        జనసేన

58        అశ్వరావు పేట    జనసేన

59        ఖమ్మం            జనసేన

60        పాలేరు            కొండపల్లి శ్రీధర్ రెడ్డి

61        మధిర            అజయ్ రాజ్

62        వైరా            జనసేన

63        సత్తుపల్లి         శ్యామ్ నాయక్

64        ములుగు        అజ్మీరా ప్రహ్లాద్/కృష్ణ

65        మక్తల్            జలంధర్ రెడ్డి

66        నారాయణపేట     రతన్ పాండురంగారెడ్డి

2nd Nov 2023, 12.15 pm
తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి సంబంధం లేదు
► ఢిల్లీ: డాక్టర్ లక్ష్మణ్, బిజెపి ఎంపీ
► ఈ నెల 7న  హైదరాబాద్ లో  బిసి ఆత్మ గౌరవ సభ ఏర్పాటు
► తెలుగుదేశం మా భాగస్వామి కాదు
► తెలంగాణలో ఎందుకు పోటీ నుంచి విరమించుకుందో టిడిపి చెప్పాలి
► టిడిపి ఇప్పటి వరకు ఎక్కడ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని చెప్పలేదు
► ఎవరో చెప్పినంత మాత్రాన  ప్రజలు వినే పరిస్థితి లేదు
► తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం ఉంటుంది
► కొందరు నేతలు పార్టీ వీడినంత మాత్రాన మాకు నష్టం లేదు
► ప్రజలు... ప్రజల ఓట్లు మాతో ఉన్నాయి
► నేతలు బయటకి వెళ్లినంత మాత్రాన వారి ఓట్లన్నీ వెళ్లిపోవు

2nd Nov 2023, 12.12 pm
ఎన్నికల వేళ నగరాన్ని అస్తవ్యస్తం చేస్తారా?
► చంద్రబాబు పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు
► నిన్న హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించిన చంద్రబాబు
► చంద్రబాబు పై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు
► అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో బాబు పై కేసు నమోదు
► ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన చంద్రబాబు, తెలుగుదేశం
► నగరం రోడ్లపై నానా న్యూసెన్స్‌
► క్రైం నెంబర్ 531/2023 IPC 341,290,341 and 21r/w76CP act
► హైదరాబాద్ సిటీ టీడీపీ పార్టీ జనరల్‌ సెక్రెటరీ GVG నాయుడు సహా పలువురిపై కేసులు నమోదు
► సుమారు 400మంది ర్యాలీలో పాల్గొన్నారని పేర్కొన్న పోలీసులు

2nd Nov 2023, 12.10 pm
నారాయణ.. నారాయణ
► పొత్తుల పై సీపీఐ నారాయణ సెటైర్లు
► ఢిల్లీ : పొత్తుల పై కాంగ్రెస్ తీరు పై నారాయణ విమర్శలు
► నిశ్చితార్థమయ్యాక ఇంకా అందమైన వాళ్లు దొరికితే లేపుకుపోయినట్టు రాజకీయాల్లో జరుగుతున్నాయి
► పొత్తులు, సీట్ల సర్దుబాటు పై స్పష్టత ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వెనక్కి తగ్గడం పై సీపీఐ నారాయణ అసహనం

2nd Nov 2023, 12.10 pm
చేయిస్తారా? చేయి కలుపుతారా?
► కాంగ్రెస్ కు సీపీఎం డెడ్‌లైన్
► వైరా, మిర్యాలగూడ కేటాయించాలంటున్న సీపీఐ
► నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు డెడ్ లైన్

2nd Nov 2023, 12.00 pm
జనసేనతో పొత్తు వద్దంండి ప్లీజ్‌
► ఢిల్లీకి బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి
► తాండూరు, శేరిలింగంపల్లి సీట్లను జనసేనకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోన్న కొండా
► బీజేపీ హైకమాండ్ కు తన అభిప్రాయాన్ని చెప్పనున్న విశ్వేశ్వర్ రెడ్డి

2nd Nov 2023, 12.00 pm
కమలం మూడో జాబితా రెడీ
► తెలంగాణలో మూడో జాబితాను సిద్ధం చేసిన బీజేపీ
► ఢిల్లీ : నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం
► 40-45 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్
► జనసేనతో పొత్తును దృష్టిలో పెట్టుకొని మరికొన్ని పెండింగ్
► ఇప్పటి వరకు 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

2nd Nov 2023, 11.30am
ఎన్నికల వేళ గెలుపు కోసం రాజశ్యామల యాగం
► సిద్దిపేట : ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో రెండో రోజు కొనసాగుతున్న రాజశ్యామల యాగం
► ఈరోజు యాగంలో రాజశ్యామల యంత్ర పూజ
► పూజలో సీఎం  కేసీఆర్‌ దంపతులు
► యాగ క్రతువును పర్యవేక్షిస్తున్న విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు

2nd Nov 2023, 11.30am
ఇందూరులో సీఎం కెసిఆర్‌
► నేడు నిజామాబాద్ వేల్పూర్ స్పైస్ పార్క్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వధ సభ
► మధ్యాహ్నం 2 గంటలకు బాల్కొండ నియోజక వర్గంలో సభ
►సభకు మంత్రి ప్రశాంత్ రెడ్డి తో పాటు చుట్టుపక్కల నియోజక వర్గాల నుంచి జన సమీకరణ

2nd Nov 2023, 11.20am
బీసీలకు వ్యతిరేకం కాంగ్రెస్‌ : డాక్టర్‌ లక్ష్మణ్‌
► ఢిల్లీ: బిసి  సీఎం చేస్తామన్న బిజెపి ప్రకటనను రాహుల్ గాంధీ చులకన చేస్తున్నారు
► బిసి వర్గాలను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారు
► పెత్తందార్ల మనస్తత్వం తో బి అర్ ఎస్,  కాంగ్రెస్ నేతలున్నారు
► బిఆర్ఎస్, కాంగ్రెస్ ను తెలంగాణ బిసిలు ఓటుతో తిప్పికొట్టాలి
► బిసి సీఎం అయ్యేందుకు బిసిలు ఏకం కావాలి, తమ సత్తా చాటాలి
► పార్లమెంట్ ఎన్నికల్లో మేము 4 సీట్లు సాధిస్తే, కాంగ్రెస్ 3 కు పరిమితం
► తరతరాలుగా బిసిలను అణగదొక్కిన పార్టీ కాంగ్రెస్

2nd Nov 2023, 11.00am
మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన రాహుల్‌గాంధీ
భూపాలపల్లి జిల్లా :మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించిన రాహుల్ గాంధీ
► ఏరియల్ సర్వే ద్వారా ద్వారా బ్యారేజ్ ని పరిశీలించిన రాహుల్ గాంధీ
► బ్యారెజ్ పరిశీలనకు ముందు అంబటిపల్లిలో మహిళా సదస్సులో పాల్గొన్న రాహుల్ గాంధీ.
► కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట కరెప్షన్ చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం : రాహుల్‌ గాంధీ
► లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టామని గొప్పలు చెప్పుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వ  అవినీతి, డొల్లతనం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో బట్టబయలైంది.
► కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన డబ్బులు ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసమే పూర్తిగా ఖర్చు పెట్టి ఉంటే.. ఇలాంటి కుంగుబాటు వచ్చి ఉండేది కాదు.
► ప్రాజెక్టు కు కేటాయించిన లక్ష కోట్లల్లో సగం డబ్బులను దోపిడీ చేసి నాసిరకంగా నిర్మాణం చేయడం వల్లే బ్యారేజ్ పిల్లర్లు కుంగాయి
► ఆధునిక టెక్నాలజీ లేని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన శ్రీశైలం,  నాగార్జునసాగర్, జూరాల నెట్టెంపాడు బీమా తదితర ప్రాజెక్టు నేటికీ పటిష్టంగా ఉన్నాయి.
► కాళేశ్వరం నిర్మాణం చేసి పట్టుమని పది రోజులు కాకముందే కుంగివడం బాధాకరం.
► చిన్నపాటి వర్షాలకే మేడిగడ్డ బ్యారేజీ కుంగితే భారీ వరదలు వస్తే తట్టుకొని నిలబడే పరిస్థితి కనిపించడం లేదు.
► కాళేశ్వరం ప్రాజెక్టు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం గా మారిందని చెప్తున్న ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లు ఎందుకని చర్యలు తీసుకోకపోవడం లేదు.
► చిన్నపాటి ఇంటి నిర్మాణం కోసం ఇంజనీర్ తో డిజైన్ చేసుకుంటాం.
► లక్ష కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఎలా డిజైన్ చేస్తారు.
► ఇంజనీర్ల పనిని ఇంజనీర్లను చేయిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు.
► సీఎం కేసీఆర్ డిజైన్ చేస్తే భవిష్యత్తులో ప్రాజెక్టు కు ప్రమాదం పొంచి ఉంటుందని కాంగ్రెస్ పార్టీగా ముందే చెప్పాము. ఇప్పుడు అదే జరిగింది.


 

సిఎల్పీ నేత భట్టి విక్రమార్క
► బ్యారేజ్ డ్యామేజ్ కి ప్రభుత్వం భాద్యత వహించాలి
► నాణ్యత లోపంతోనే బ్యారేజ్ కి సంబంధించిన పది పిల్లర్లు కుంగాయి.
► డ్యామేజ్ ని స్వయంగా పరిశీలించాం.
► బ్యారేజ్ తో ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు.
► కేసిఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం గా మారింది.
► ప్రాజెక్టు అవినీతి అక్రమాలపై బిజెపి బిఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి.
► రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు.
► కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి.
► కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

2nd Nov 2023, 10.55am
కాంగ్రెస్‌ పొత్తు యూటర్న్‌పై నారాయణ ట్వీట్‌
► పొత్తులో సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ యూటర్న్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అసహనం వ్యక్తం చేశారు.
► ఆల్రెడీ లెఫ్ట్ పార్టీలకు కేటాయించిన సీట్లను కొత్త వారు జాయిన్ అవ్వగానే వాళ్లకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

2nd Nov 2023, 10.35am
ఇండిపెండెంట్‌గా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి!
► హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌ పొన్నంకు ఖరారు కావడంతో టికెట్‌ ఆశించి భంగపడిన ప్రవీణ్‌రెడ్డి
► ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం

2nd Nov 2023, 10.20am
బెదిరింపు రాజకీయాలు
► కాంగ్రెస్ పార్టీలో చేరుతావని అని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ నేత మాగంటి గోపీనాథ్ గుండల్ని పంపించి నాపై దాడి చేశారు:  రాష్ట్ర వడ్డెర ఐక్యత వేదిక అధ్యక్షుడు వేముల యాదయ్య

2nd Nov 2023, 10.05am
ఐటీ అధికారుల సోదాలు
► మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఇంటిపై ఐటీ అధికారుల సోదాలు
► తెల్లవారుజామున 5గంటలకు చేరుకుని పారిజాత కూతురి ఫోన్ స్వాధీనం
► ప్రస్తుతం పారిజాత తిరుపతి లో, ఆమె భర్త నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉన్నారు.
► మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ నివాసం లో కొనసాగుతున్న ఐటీ సోదలు
►  తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్న కేఎల్ఆర్ ఫామ్ హౌస్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

2nd Nov 2023, 9.45am
కేసీఆర్ పర్యటన
► నేడు నిజామాబాద్ వేల్పూర్ స్పైస్ పార్క్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వధ సభ
► మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సభకు మంత్రి ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజక వర్గం తో పాటు చుట్టుపక్కల నియోజక వర్గాల నుంచి జన సమీకరణ
► ధర్మపురి  జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాదం సభలో ప్రసంగించనున్న కేసీఆర్

2nd Nov 2023, 9.30am
చాయ్‌ చేసి.. ఓట్లు అడిగి..


► ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రజలు చేసే పనుల్లో భాగస్వాములవుతున్నారు నాయకులు 
► అల్లాదుర్గంలో బుధవారం అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఎన్నికల ప్రచారం

2nd Nov 2023, 9am
జయభేరి విన్నాకే.. కాళ్లకు జోళ్లు
► ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ అసెంబ్లీ నియోజకవర్గ భారాస అభ్యర్థి అనిల్‌ జాదవ్‌ ఎన్నికల ప్రచారం 
► ఎన్నికల ప్రచారంలో చెప్పులు లేకుండా ఎన్నికల ప్రచారం.. 
► ఎన్నికల్లో గెలిచాకే చెప్పులు ధరిస్తా

Advertisement
Advertisement