జాతీయ భేటీలతో మైలేజీ పెంచుకోవాలి

11 Jun, 2022 01:12 IST|Sakshi

రాష్ట్రంలో రాజకీయంగా మరింత ఎదగాలి

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని చాటాలి

రాష్ట్ర నాయకత్వం యోచన

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో బీజేపీ రాజకీయ ఎదుగుదలకు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకు అవసరమైన కార్యాచరణపై దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి  ప్రత్నామ్యాయం బీజేపీనే అనే ప్రచారాన్ని వివిధ రూపాల్లో నిర్వహించాలని నిర్ణయించింది.

తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదటి సారిగా హైదరాబాద్‌లో ఈ సమావేశాలు జరగ నుండడం, ఉమ్మడి ఏపీలో 2003లో నిర్వహిం చాక 20 ఏళ్ల తర్వాత ఇక్కడ నిర్వహిస్తుండ టాన్ని పెద్దయెత్తున ప్రచారం చేయనుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలనే  ధ్యేయంతోనే ఈ భేటీకి తెలంగాణ ను జాతీయ నాయకత్వం ఎంపిక చేసిందనే సందేశాన్ని  ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లో నూ ఈ సమావేశాలకు సంబంధించి  ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తోంది.

ఆ 3 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ను జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నాయకత్వం నిర్దేశించనుందనే ప్రచారాన్ని కూడా ముందుకు తీసుకెళ్లను న్నారు. సమావేశాలు ముగిసేదాకా రాష్ట్రవ్యా ప్తంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్ర బీజేపీ యోచిస్తోంది. జూలై 1,2,3 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రా ల్లో పార్టీపరంగా ఏదైనా కార్యక్రమాన్ని నిర్వ హించి, జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రత్యే కతను, ఎందుకు రాష్ట్రంలో వాటిని నిర్వహిస్తు న్నారనే విషయాలను తెలియజేయాలని నిర్ణయించారు.

తెలంగాణకు, రాష్ట్ర పార్టీకి.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా ఇస్తున్న ప్రాధాన్యతను గురించి వివరించనున్నారు. 3 రోజులపాటు పలువురు కేంద్రమంత్రులు, 18 రాష్ట్రాల సీఎంలు  హైద రాబాద్‌లోనే బస చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాతీలు, మహారాష్ట్రి యన్లు, పంజాబీలు, తమిళులు, కన్నడ ప్రముఖులతో సమావేశాలు నిర్వహించి రాష్ట్రపార్టీకి మద్దతు కూడగట్టనున్నారు. 

సెల్ఫీలు దిగితే సెల్‌ఫోన్లు లాక్కుంటాం...
ఈ సమావేశాల్లో ప్రధానిసహా ముఖ్యనేత లతోనూ సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయొ ద్దని జాతీయ నేతలు హెచ్చరించారు. సెల్ఫీ లు దిగి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పెట్టే ప్రయ త్నాలు చేయొద్దని సూచించారు. ఈ సూచనలు ఉల్లంఘిస్తే ఫోన్లు లాగేసుకుంటామని  స్పష్టం చేశారు.    

మరిన్ని వార్తలు