Sakshi News home page

మహేశ్వరంలో ఉద్రిక్తత.. సబితా క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి బీజేపీ యత్నం

Published Fri, Aug 25 2023 9:46 AM

Telangana BJP Protest At Collectorate Over Govt Promises Failure - Sakshi

► సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం నేతృత్వంలో బీజేపీ ధర్నా చేపట్టింది. కేసీఆర్‌, కేటీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాంచాలంటూ కలెక్టరేట్ ముట్టడించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

►లక్డికాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా చేపట్టింది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

►రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లెలగూడలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ముట్టడికి మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ సహా బీజేపీ నాయకులు యత్నించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కార్యాకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. బీజేపీ నాయకులను అరెస్ట్‌ చేశారు. క్యాంప్‌ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

►సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ శ్రేణులు ముట్టించాయి. మంత్రి కార్యాలయంలోకి కాషాయ పార్టీ కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలతో తోపులాట జరిగింది. పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

సాక్షి, మెదక్‌: ప్రజా సమస్యలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ముట్టడికి నేడు (శుక్రవారం) తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మెదక్‌ జిల్లాలో మాజీ ఎంపీ విజయశాంతి ధర్నాలో పాల్గొననున్నారు. సిద్ధిపేట జిల్లాలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు పాల్గొననున్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి బాబు మోహన్ ధర్నాలో కూర్చోనున్నారు. 

ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చలంటూ బీజేపీ పిలుపునిచ్చిన కలెక్టరేట్ ముట్టడికి వెళ్లకుండా హుజూరాబాద్‌లోనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement