24 గంట‌ల్లో తెలంగాణ‌లో కొత్తగా 3762 కేసులు

26 May, 2021 18:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో  కొత్తగా 3762 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. కోవిడ్ బాధితుల్లో 20 మంది మ‌ర‌ణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3816 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,22,082 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 38,632 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో 528, మేడ్చల్‌లో 213, ఖమ్మంలో 214, రంగారెడ్డిలో 229 నమోదయ్యాయి.

చదవండి: సమ్మె చేసేందుకు ఇది సమయం కాదు: మంత్రి కేటీఆర్


 

మరిన్ని వార్తలు