టెస్లా రోబో.. యమ డేంజర్‌! | Sakshi
Sakshi News home page

టెస్లా రోబో.. యమ డేంజర్‌!

Published Thu, Dec 28 2023 12:25 PM

Tesla Robot Very Dangerous Attacks Engineer - Sakshi

అమెరికాలోని టెక్సాస్‌లో ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా గీగా ఫ్యాక్టరీలోని ఓ రోబో కారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గీగా ఫ్యాక్టరీలో ప్రమాదాలపై అమెరికా ఆక్యూపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అందిన నివేదికలో (ఇంజ్యురీ రిపోర్టు) ద్వారా ఈ విషయం బయటపడింది.

రెండేళ్ల క్రితం ఆస్టిన్‌లోని టెస్లా గీగా ఫ్యాక్టరీలో.. అల్యూమినియం పలకలను కోసి కారు విడిభాగాలను తయారు చేసేందుకు టెస్లా రోబోలను వినియోగిస్తుంటారు. రోబోల సాఫ్ట్‌వేర్‌ను ఇంజినీర్ అప్‌డేట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందట. సాధారణంగా ఇలాంటి సమయాల్లో రోబోలను ఇన్‌యాక్టివ్‌ చేస్తారు. అయితే, ఘటన జరిగిన రోజున అప్పటికే ఇంజనీర్‌ రెండింటిని ఇన్‌యాక్టివ్‌ చేశాడు. మరో రోబోని చేయడం మరిచిపోయాడు. అలా.. అది అతనిపై దాడికి దిగింది. 

అప్‌డేట్ సమయంలో అది ఇంజినీర్‌ను కింద పడదోసి, అదిమిపెట్టి బంధించింది. రోబోకున్న ఉన్న పదునైన భాగాలు బాధితుడి వీపులోకి దిగబడ్డాయి. అతడి చేతికి కూడా త్రీవ గాయమైంది. ఫ్యాక్టరీ ఫ్లోర్‌ రక్తిసిక్తమైంది. ఈ ప్రమాదం మినహా 2021,2022లో  మరే ఇతర ప్రమాదాలు జరగలేదు. అయితే, ఫ్యాక్టరీలో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు ఆ నివేదికలో తేలింది.

టెక్సాస్‌లోని ఫ్యాక్టరీలో గతేడాది సగటున 21 మంది సిబ్బందిలో ఒకరు గాయాల పాలయ్యారని ఇంజ్యురీ రిపోర్టులో తేలిసింది. ఆటోమొబైల్ రంగంలో సగటు కంటే ఇది అధికం. కాగా, కంపెనీలో తరచూ భద్రతాపరమైన ఉల్లంఘనలు జరుగుతున్నాయని గతంలో కొందరు టెస్లా మాజీ సిబ్బంది ఆరోపించారు. నిర్మాణం, నిర్వహణ, ఇతర కార్యకలాపాల్లో తగినన్ని జాగ్రత్తలు లేకపోవడంతో ఉద్యోగులకు రిస్క్ ఎక్కువవుతోందని తెలిపారు.

Advertisement
Advertisement