క‌రోనా స‌మ‌యంలో రెచ్చిపోతున్న దొంగ‌లు

6 Aug, 2020 12:13 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్ :  క‌రోనా స‌మ‌యంలో త‌మ‌కు అనుకూలంగా మ‌ర‌ల్చుకొని దొంగ‌లు వ‌రుస చోరీల‌కు పాల్ప‌డుతున్నారు.  ఆల‌య హుండీలే టార్గెట్‌గా దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నారు. ఆల‌య హుండీలు ఎత్తుకెళ్లి న‌గ‌దు చోరీ చేసి పొలాల్లో హుంండీల‌ను వదిలేసి ప‌రార‌వుతున్నారు. గ్రామంలోని  హ‌నుమాన్ పోలేర‌మ్మ స‌హా ఆరు ఆల‌యాల్లో వ‌రుస చోరీల‌కు పాల్ప‌డుతూ డ‌బ్బులు సొమ్ము చేసుకుంటున్నారు.

న‌వీపేట్ మండ‌లంలో ఒకేరోజు 6 ఆల‌యాల్లో హుండీల‌ను దోచుకెళ్లారు దుండ‌గులు. ఆల‌యంలోని సీసీ టీవీ ఫుటేజీలో ఇదంతా రికార్డు అయ్యింది. వ‌రుస దొంగ‌త‌నాల‌తో స్థానికులు భ‌యందోళ‌న‌కు గురువుతున్నారు. ఇక ఆల‌యాల్లో వ‌రుస చోరీలు పోలీసుల‌కు స‌వాల్‌గా మారింది. రోజూ ఏదో ఒక ప్రాంతంలో దొంగ‌తానాల‌కు పాల్ప‌డుతూ పోలీసుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలోనే చోరీలు జ‌రుగుతున్నాయా అన్న కోణంలోనూ పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా