Varalaxmi Vratham: మహిళల ప్రత్యేక పూజలు

20 Aug, 2021 08:56 IST|Sakshi

సాక్షి,ఖమ్మం: శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. ఈరోజు వీలుకాకపోతే వచ్చే శుక్రవారాల్లో కూడా వ్రతాన్ని ఆచరించవచ్చని అర్చకులు చెబుతున్నారు. ఈ మేరకు మహిళలు పూలు, ఇతర పూజా సామగ్రి కొనుగోలు చేస్తూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక ఆలయాల్లో ప్రత్యేక పూజలు , వ్రత నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మంగళకరం...
ఇళ్లలో వరలక్ష్మి వ్రతం ఆచరించే మహిళలు పూజా మందిరంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని అమరుస్తారు. ఆ తర్వాత వ్రతం ఆచరించి చుట్టుపక్కల మహిళలను పిలిచి వాయినాలు ఇస్తారు. ఇళ్లలో కుదరని వారు దేవాలయాల్లో జరిగే సామూహిక వ్రతాల్లో పాల్గొంటారు. ఇందుకోసం ఖమ్మం నగరంలోని పలు ఆలయాల్లో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తితో వేడుకుంటే కోరిన వరాలను ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మీదేవి అని నమ్మిక. ఏ నియమాలు, మడులు అవసరం లేకుండా నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి, ఏకాగ్రతతో ఈ వ్రతం ఆచరించొచ్చని అర్చకులు చెబుతున్నారు. సకల శుభాల కోసమే కాకుండా దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలని మహిళలు ఈ వ్రతం ఆచరిస్తుంటారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు