Ukraine Cat: ఉక్రెయిన్‌ నుంచి పిల్లిని తెచ్చుకున్నాడు.. కానీ | Sakshi
Sakshi News home page

Ukraine Cat: పెంపుడు పిల్లితో ఉక్రెయిన్ నుంచి ఖమ్మానికి..కానీ

Published Tue, Mar 8 2022 10:21 AM

Viral: Khammam Student Brought The Cat From Ukraine - Sakshi

సాక్షి, ఖమ్మం: ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థి తాను పెంచుకుంటున్న పిల్లితో సహా వచ్చేశాడు. కానీ ఆ పిల్లి ఇక్కడ వేడిని తట్టుకోలేకపోతోంది. కల్లూరు మండలం చిన్నకోరుకొండికి చెందిన పుదురు ప్రఖ్యాత్‌ ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదువుతూ మూడేళ్లుగా పిల్లిని పెంచుకుంటున్నాడు. అక్కడి నుంచి విమానంలో రాగా, ఢిల్లీ – హైదరాబాద్‌ విమానంలో పిల్లిని అనుమతించలేదు.

దీంతో తనకు రూ.15వేలతో, పిల్లికి రూ.6వేలతో టికెట్‌ కొని హైదరాబాద్‌కు, అక్కడి నుంచి స్వస్థలానికి చేరుకున్నాడు. ఖమ్మం సోమవారం వచ్చిన ఆయన మాట్లాడుతూ ఇక్కడ వేడితో పిల్లి తట్టుకోలేకపోతుందని తెలిపాడు. తడి బట్టతో గంటకోసారి తుడుస్తూ కాపాడుతున్నామని ప్రఖ్యాత్‌ వెల్లడించారు.
చదవండి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం: రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవే

Advertisement
Advertisement