Woman Complaint On CID DSP Over Harassing Her - Sakshi
Sakshi News home page

కీచక డీఎస్పీ.. బాధితురాలి ఫోన్‌కు రొమాంటిక్‌ పాటలు, వీడియోలు

Published Mon, Jul 31 2023 7:41 AM

Woman Complaint On DSP  - Sakshi

సాక్షి,హైదరాబాద్: పోలీసు నినాదం గతి తప్పింది. మహిళలకు రక్షణకుకల్పించాల్సిన పోలీసే వేధింపులకు గురి చేశాడు. సమస్య ఉందని ఆశ్రయించిన ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ) డీఎస్పీ కిషన్‌ సింగ్‌జీపై చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మార్గదర్శి కాలనీకి చెందిన మహిళ (48) తెలంగాణ రాష్ట్ర సదరన్‌ పవర్‌ డి్రస్టిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌)లో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది.

 2020లో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నేషనల్‌ ఇంటర్‌ డిపార్ట్‌మెంట్‌ క్రీడా పోటీలకు సిద్ధమవుతున్న సమయంలో సీఐడీ డీఎస్పీ కిషన్‌ సింగ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. శిక్షణ తరగతులకు హాజరుకావాలని అతను ఆమెకు సూచించాడు. సీనియర్‌ పోలీసు అధికారి కావటంతో అంగీకరించిన బాధితురాలు.. తన ఫోన్‌ నంబరును పోలీసు అధికారికి ఇచి్చంది. అప్పటి నుంచి ఆ పోలీసు ఉన్నతాధికారి ఆమె వాట్సాప్‌ నంబరుకు రొమాంటిక్‌ హిందీ పాటలు, సెన్సార్‌ చేయని వీడియోలను పంపించడం మొదలుపెట్టాడు. శిక్షణ తరగతులకు చీర కట్టుకోవాలని రావాలంటూ ఒత్తిడికి గురి చేసేవాడని బాధితురాలు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.  

సాయం కోసం వెళితే..  
కిషన్‌సింగ్‌ ప్రవర్తన బాగా లేకపోవటంతో ఫోన్‌ కాల్స్‌కు, వీడియోలకు ఏడాది పాటు స్పందించడం మానేసింది. కొన్ని నెలల క్రితం హయత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ప్రమాదం జరిగినప్పుడు సహాయం కోసం బాధితురాలు సదరు సీఐడీ పోలీసు అధికారిని సంప్రదించింది. దీన్ని ఆసరా చేసుకున్న అతను.. తనతో చనువుగా ఉండాలని, తనను కౌగిలించుకోవాలని పట్టుబట్టాడు.

ఆమె ఒప్పుకోకపోవటంతో భవిష్యత్తులో ఎలాంటి సహాయం చేయనని బెదిరించాడు. దీంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. వారి సూచన మేరకు.. చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడు కిషన్‌సింగ్‌పై 354 (డి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాధితురాలి సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుని  మరిన్ని వివరాలు, సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.  

Advertisement
Advertisement