25, 26 తేదీల్లో అంతర జిల్లా షటిల్‌ పోటీలు | Sakshi
Sakshi News home page

25, 26 తేదీల్లో అంతర జిల్లా షటిల్‌ పోటీలు

Published Fri, Mar 24 2023 5:42 AM

సమావేశంలో మాట్లాడుతున్న స్టేడియం నిర్వహకులు హర్షవర్దన్‌రెడ్డి  - Sakshi

గూడూరు: గూడూరు పట్టణ సమీపంలోని హెచ్‌డీ ఎరీనా ఇండోర్‌ స్టేడియంలో ఈనెల 25, 26 తేదీల్లో అంతర జిల్లాల షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు హర్షవర్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్‌డీ ఎరీనా ఇండోర్‌ స్టేడియం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాన్‌ మెడలిస్ట్‌, 45 ప్లస్‌ రెండు విభాగాల్లో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు షీల్డుతోపాటు నగదు బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల క్రీడాకారులు పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వైజీఎస్‌బీఏ అధ్యక్షుడు జమాలుల్లా, కోదండపాణి, నాగేంద్రరెడ్డి, రవి, సురేష్‌, మల్లికార్జున్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement