విద్యుత్‌ చౌర్యంపై దాడులు | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ చౌర్యంపై దాడులు

Published Mon, May 22 2023 12:18 AM

-

– రూ.5.37 లక్షల జరిమానా

తిరుపతి రూరల్‌: జిల్లాలోని కోట మండలంలో విద్యుత్‌ చౌర్యంపై అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. డీఈ వరప్రసాదరెడ్డి, డీపీఈ వింగ్‌ విజిలెన్స్‌ డీఈలు జగదీష్‌, సుధాకర్‌, ఏపీటీయస్‌ సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చిట్టమూరు పరిధిలోని ఆరూరు, ఈశ్వరవాక , రాఘవారిపాళెం రొయ్యల గుంటల వద్ద విద్యుత్‌ సర్వీసులను తనిఖీ చేశారు. ఆరూరు, ఈశ్వరవాక , రాఘవారిపాళెంలో ఈగల చిరంజీవి నాగముంతల సుబ్బయ్య, మల్లి వెంకటాచలం అనే రైతులు విద్యుత్‌ చౌర్యం చేస్తున్నట్లు గుర్తించారు. రూ.5,37,035 అపరాధ రుసుం విధించారు. సీఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే, జరిమానాతోపాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆవు దొంగల అరెస్టు

పలమనేరు: మండలంలోని పలుచోట్ల పాడి ఆవులను అపరించిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల పలు గ్రామాల్లో ఆవులను కొందరు దొంగిలించి టెంపోలో తరలించి, వేరే ప్రాంతాల్లో అమ్మకాలు చేసిన విషయం తెలిసిందే. ఈ చోరీలపై నమోదైన కేసుల్లో దర్యాప్తు చేసిన పోలీసుల పలువురు నిందితులను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నట్లు సమాచారం .

Advertisement
Advertisement