చల్లారని జ్వాల | Sakshi
Sakshi News home page

చల్లారని జ్వాల

Published Thu, Jul 13 2023 5:54 AM

- - Sakshi

పవన్‌కల్యాణ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలకు ప్రభుత్వ సేవలను దూరం చేయాలనే కుట్రలపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. సమాజానికి తలలో నాలుకగా విధులు నిర్వర్తిస్తున్న వలంటీర్లను అవమానించడంపై వివిధ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే సేవా సైనికులు ధర్నాలు.. రాస్తారోకోలు.. ర్యాలీలు.. దిష్టిబొమ్మల దహనాలతో కదం తొక్కారు. చంద్రబాబు అజెండాను అమలు చేస్తూ.. అనుచితంగా మాట్లాడుతున్న జనసేన అధినేత బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దిగజారి వ్యవహరిస్తున్న పవన్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తిరుపతిలో పవన్‌, బాబు ఫ్లెక్సీలను దహనం చేస్తున్న వలంటీర్లు, నేతలు

సాక్షి, తిరుపతి : రాష్ట్రంలోని అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు.. సేవలు అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్న వలంటీర్లపై పవన్‌ కల్యాణ్‌ చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు నిరసన జ్వాలలు చల్లారలేదు. సేవే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తుంటే నోటికొచ్చినట్లు మాట్లాడడం ఏంటని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తశుద్ధితో ప్రజలకు సేవలందిస్తుంటే అసత్య ఆరోపణలతో విషం చిమ్మడం దారుణమని మండిపడుతున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు.

పవన్‌ అభ్యంతర వ్యాఖ్యలపై ఆందోళనలు ప్రజలకు ప్రభుత్వ సేవలను దూరం చేయాలనే కుట్రలు పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు,దిష్టిబొమ్మల దహనాలు జనసేనాని బహిరంగ క్షమాపణలు చెప్పాలంటున్న వలంటీర్లు

గూడూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద..
1/2

గూడూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద..

గాజులమండ్యం వద్ద ర్యాలీ
2/2

గాజులమండ్యం వద్ద ర్యాలీ

Advertisement
Advertisement