క్రీడలతో మానసిక వికాసం | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసిక వికాసం

Published Mon, Oct 9 2023 12:52 AM

 తైక్వాండో పోటీలను ప్రారంభిస్తున్న తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి - Sakshi

● తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి ● ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్‌–17 తైక్వాండో పోటీలు ప్రారంభం

తిరుపతి రూరల్‌: క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతోపాటు మానసిక వికాసం పెరుగుతుందని తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్‌ – 17 బాలబాలికల తైక్వాండో పోటీలు, ఎంపిక ప్రక్రియ ఆదివారం తి రుపతి రూరల్‌ మండలం పెరుమాళ్లపల్లె జెడ్పీ హై స్కూల్‌లో నిర్వహించారు. ఈ పోటీలకు తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజ రై, ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేటి కాలంలో విద్యార్థుల్లో ఆత్మరక్షణకు సంబంధించిన క్రీడలను ప్రోత్సహించాలని సూచించారు. ఇలాంటి పోటీలను పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెల్లో కూడా ప్రారంభించాలన్నారు. నాడు– నేడు పథకం కింద ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేసిందన్నారు. కార్పొరేట్‌ తరహాలో ప్రభుత్వ పాఠశాలలు అందంగా రూపుదిద్దుకున్నాయని చెప్పారు. చిన్నారుల్లో క్రీడాశక్తిని పెంపొందించేందుకు తన వంతు బాధ్యతగా వ్యవహరిస్తానని తెలిపారు. నేటి బా లలే రేపటి పౌరులని, ఆ దిశగా వారిని గొప్పగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ తైక్వాండో పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో మొదటిసారి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో తాను ఎంపీటీసీ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్న పెరుమాళ్లపల్లె పాఠశాల వేదిక కావడం సంతోషకరమన్నారు. ఈ పోటీలకు చిత్తూరు, తిరుపతి అన్నమయ్య జిల్లాల నుంచి సుమారు వందమంది బాలబాలికలు హాజరుకానున్నట్లు కార్యనిర్వహణ కార్యదర్శి బట్టు నాగమల్లేశ్వరి తెలిపారు.

రూ.25 వేల విరాళం

తైక్వాండో క్రీడలను ప్రోత్సహించేందుకు తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తన వ్యక్తిగత నగదు రూ.25 వేలు పెరుమాళ్లపల్లె జెడ్పీ హైస్కూల్‌కు విరాళంగా అందజేశారు. తైక్వాండోకు కావాల్సిన మాట్స్‌ కొనుగోలు చేయాలని సూచించారు. 2017 నుంచి సుమారు జిల్లాస్థాయికి 73 మంది, రాష్ట్ర, జాతీయ స్థాయికి 14 మంది ఎంపికై పతకాలు సాధించారని తెలిపారు. ఈ ఘనత పెరుమాళ్లపల్లె పాఠశాలకు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొత్తపాటి మునీశ్వరరెడ్డి, సర్పంచ్‌ జోగి మోహన్‌, ఉప సర్పంచ్‌ వెంకట్‌ నారాయణ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి సురేష్‌ బాబు, జిల్లా వ్యాయామ సంఘం కార్యదర్శి బొందు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement