చల్లా బాబుకు స్వగ్రామంలో షాక్‌ | Sakshi
Sakshi News home page

చల్లా బాబుకు స్వగ్రామంలో షాక్‌

Published Mon, Oct 9 2023 12:52 AM

రొంపిచెర్ల: మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నాయకులు   - Sakshi

రొంపిచెర్ల: పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డికి సొంత గ్రామం బొమ్మయ్యగారిపల్లెలో భారీ షాక్‌ తగిలింది. రెండుసార్లు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన గుండ్లూరి రామచంద్రారెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ నాయకులు రాజారెడ్డి, రమణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, సతీష్‌, భాస్కర్‌శెట్టి, ము నిరెడ్డి వారి అనుచరులతో కలసి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము టీడీపీ అవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందించామన్నారు. కష్టకాలంలో ఆర్థికంగా తోడున్న తమకు గుర్తింపు లేదన్నారు. పార్టీలకు అతీతంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి చూసి వైఎస్సాసీపీలో చేరామని తెలిపారు. వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తానని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డీశ్వర్‌ రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు దేవులపల్లె హరినాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఇబ్రహీంఖాన్‌, వైస్‌ ఎంపీపీలు నూలు రెడ్డెప్ప, విజయశేఖర్‌, నాయకులు డాక్టర్‌ శ్రీనాఽథ్‌, కోటా వెంకటరమణ, విజయభాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

300 మంది టీడీపీ కార్యకర్తల చేరిక

తిరుపతి సిటీ: వైఎస్సార్‌ సీపీలో కొనసాగడం ఒక గౌరవం, హోదాగా భావించాలని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పద్మావతి పురంలోని ఆయన నివాసంలో తిరుపతి 33వ డివిజన్‌ స్కావెంజర్స్‌ కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేత, వార్డు అధ్యక్షుడు ఎన్‌వీ రమణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మందికి పైగా ర్యాలీగా వచ్చి ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే భూమన వారికి పార్టీ కండువా కప్పి, ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంత పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాన్యుని నమ్మకమన్నారు. చంద్రబాబు అండ్‌ కో పార్టీ, పవన్‌ లాంటి వారు డబ్బున్న వాళ్లకు కొమ్ముకాసే వ్యక్తులని, వారిని ప్రజలు విశ్వసించరన్నారు. దూది శివ, కార్పొరేటర్‌ దూది కుమారి, నగరపాలక సంస్థ కోఆప్షన్‌ సభ్యులు ఇమామ్‌ ఆధ్వర్యంలో రమాణారెడ్డి బృందం చేరికతో 33వ డివిజన్‌ పార్టీ మరింత బలపడిందన్నారు. 33వ డివిజన్‌ పార్టీ అధ్యక్షుడు దూది శివ రాయల్‌ మాట్లాడుతూ దేశంలో సామాన్య ప్రజల సమస్యలు విని వారికి అండగా నిలిచి పోరాడే ఎమ్మెల్యే మనకు దొరకడం అదృష్టమన్నారు. అనంతరం కార్యకర్తలు ఎమ్మెల్యేని గజమాలతో సత్కరించారు. తరువాత ఎమ్మెల్యే టీడీపీ నాయకులు ఎన్‌వీ రమణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, శ్రీకాంత్‌ ,బాలాజీ, జ్యోతి, అంజలి, లక్ష్మీ, ఝాన్సీ, మహేష్‌ రాయల్‌, రామ్మోహన్‌, మణి ఆచారి, అనీల్‌ కుమార్‌, శేఖర్‌రెడ్డి, ప్రసన్నకుమార్‌, పవన్‌ కుమార్‌, విజయ, మోహన్‌రెడ్డి, కోదండ, గుణ, రాజేశ్వరి, చరణ్‌ బృందానికి వైఎస్సార్‌ సీసీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి, వైస్‌ ఎంపీపీ

వైఎస్సార్‌సీపీలో చేరిక

బొమ్మయ్యగారిపల్లెకు చెందిన 50 మంది

టీడీపీ కార్యకర్తల చేరిక

సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలలోకి తీసుకెళ్లాలని న గరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం జగన్‌ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్నాయని, అందరం కలసి కట్టుగా పనిచేయాల్సి అవసరముందన్నారు. అనంతరం పార్టీ నాయకులు అభినయ్‌రెడ్డి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేంద్ర, పూసపాటి మోహన్‌రాజ్‌, ఇమ్రాన్‌ బాషా, దినేష్‌ రాయల్‌, లవ్‌లీ వెంకటేష్‌, పద్మజ, మద్దాలి శేఖర్‌ రాయల్‌ పాల్గొన్నారు.

తిరుపతిసిటీ: మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్‌, ఎమ్మెల్యే  భూమన కరుణాకరరెడ్డి
1/2

తిరుపతిసిటీ: మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్‌, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి

డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌రెడ్డిని గజమాలతో సత్కరిస్తున్న 33వ డివిజన్‌ పార్టీనేతలు
2/2

డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌రెడ్డిని గజమాలతో సత్కరిస్తున్న 33వ డివిజన్‌ పార్టీనేతలు

Advertisement
Advertisement