వైఎస్సార్‌సీపీలో చేరిక | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిక

Published Tue, Nov 7 2023 7:46 AM

బాలుర విభాగంలో విన్నర్స్‌గా నిలిచిన విశాఖపట్నం జిల్లా జట్టు  - Sakshi

సైదాపురం: మండలంలోని తుమ్మలతలుపూరు పంచాయతీకి చెందిన టీడీపీ ఉప సర్పంచ్‌ దాసినేని శ్రీకాంత్‌ చౌదరితోపాటు వెంకటరమణయ్య తన అనుచరులతో కలిసి సోమవారం వైఎస్సార్‌ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

విన్నర్స్‌ విశాఖపట్నం, కృష్ణా

రన్నర్స్‌ పశ్చిమ గోదావరి, గుంటూరు

ముగిసిన రాష్ట్ర స్థాయి అండర్‌–19 బాల బాలికల వాలీబాల్‌ పోటీలు

తిరుపతి ఎడ్యుకేషన్‌ : తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్‌ హైస్కూల్లో మూడు రోజులుగా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) నిర్వహిస్తున్న అండర్‌–19 రాష్ట్ర స్థాయి బాలబాలికల వాలీబాల్‌ పోటీలు సోమవారం ముగిశాయి. ఈ పోటీలకు హాజరైన రాష్ట్రంలోని 13ఉమ్మడి జిల్లాల బాలబాలికల జట్లకు లీగ్‌, నాకౌట్‌ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. బాలుర విభాగం ఫైనల్స్‌లో పశ్చిమ గోదావరిపై విశాఖపట్నం, బాలికల విభాగంలో గుంటూరుపై కృష్ణా జిల్లా జట్లు విజయం సాధించాయి. బాలుర విభాగంలో తృతీయ, నాల్గవ స్థానాల్లో విజయనగరం, శ్రీకాకుళం జట్లు, బాలికల విభాగంలో విశాఖపట్నం, అనంతపురం జట్లు నిలిచాయి. వివిధ జిల్లాల జట్లలో ప్రతిభ చాటిన క్రీడాకారులతో జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్ర బాలబాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌.జయరామయ్య తెలిపారు. కార్యక్రమంలో 13జిల్లాల వాలీబాల్‌ క్రీడాకారులు, కోచ్‌లు పాల్గొన్నారు.

‘కూల్‌’గా ముంచేశాడు!

కూల్‌డ్రింక్‌ కంపెనీ ఉద్యోగి అంటూ రూ.10వేలు కొట్టేశాడు!

నాయుడుపేటటౌన్‌: ప్రముఖ కూల్‌డ్రింక్‌ కంపెనీలో ఉద్యోగినని చెప్పి నమ్మించాడు. రూ.10వేలు కడితే పెద్ద రిఫ్రిజిరేటర్‌ ఇస్తానని నమ్మబలికాడు. తీరా డబ్బులు కట్టించుకుని రిఫ్రిజిరేటర్‌ ఇవ్వకుండా హుడాయించాడు. ఈ ఘటన మండలంలో సంచలనం కలిగించింది. వివరాలు మండల పరిధిలోని తిమ్మాజికండ్రిగ గ్రామ సమీపంలో దాబా నిర్వహిస్తున్న రమేష్‌కు ఆదివారం ఓ వ్యక్తి ఫోన్‌చేసి తన పేరు శ్రీకాంత్‌ అని చెప్పాడు. తాను ఓ ప్రముఖ కూల్‌డ్రింక్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పి కూల్‌డ్రింక్‌లు సరఫరా చేసే వ్యాను పక్కనే నిలబడి ఫొటోలను పెట్టి నమ్మించాడు. అంతేకాకుండా రూ.10 వేలు చెల్లిస్తే మీకు కూల్‌ డ్రింక్‌లు పెట్టుకునేందుకు పెద్ద ఫ్రిజ్‌ ఇస్తామని చెప్పారు. మీరు కట్టిన రూ.10 వేలకు కూల్‌డ్రింక్‌లు సైతం ఇస్తామని చెప్పడంతో రమేష్‌ సరేనని చెప్పి, తాను సూచించిన నంబర్‌కు రూ.10వేలు ఫోన్‌పే ద్వారా పంపాడు. నగదు చెల్లించిన కొద్ది సేపటికే ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయడంతో అనుమానం వచ్చి ఆ కూల్‌డ్రింక్‌ కంపెనీకి చెందిన డీలర్‌ వద్దకు వెళ్లి విచారించగా ఆ పేరు కలిగిన వ్యక్తి ఎవరూ కంపెనీలో పనిచేయడం లేదని చెప్పడంతో బోరుమన్నాడు. ఆపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పార్టీలోకి ఆహ్వానిస్తున్న నేదురుమల్లి
1/3

పార్టీలోకి ఆహ్వానిస్తున్న నేదురుమల్లి

2/3

 సైబర్‌ నేరగాడు పెట్టిన ఫొటోలు
3/3

సైబర్‌ నేరగాడు పెట్టిన ఫొటోలు

Advertisement
Advertisement