వెల్లువెత్తిన అభిమానం | Sakshi
Sakshi News home page

వెల్లువెత్తిన అభిమానం

Published Fri, Nov 10 2023 4:52 AM

- - Sakshi

తిరుపతి రూరల్‌: చంద్రగిరి ప్రజల అభిమాన నాయకుడు, జనం మెచ్చిన నేత, ప్రభుత్వ విప్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఆయన స్వగ్రామం తుమ్మలగుంట వేలాది మంది పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజా ప్రతినిధులు, మహిళా కార్యకర్తలు, అధి కారుల రాకతో కిక్కిరిసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీగా తరలి వచ్చిన పార్టీ నేతలు, అభిమానులు, కుటుంబ సభ్యుల నడుమ ఎమ్మెల్యే చెవిరెడ్డి భారీ కేక్‌ కట్‌ చేశారు. గజ మాలలతో ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఆయా కాలనీల వార్డు సభ్యులు, సర్పంచ్‌ లు, మహిళా, సంక్షేమ సంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల నేతలు సన్మానించారు. పుష్పగుచ్ఛాలు, శాలువలకు బదులుగా పూల మొక్కలు, నోటు పుస్తకా లు, పెన్నులు, పెన్సిళ్లు, స్కూల్‌ బ్యాగులను అందించారు. చెవిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అన్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు చెవిరెడ్డి నివాస ప్రాంగణం జన సందడిగా మారింది. శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, అభిమానులు శ్రేయోభిలాషులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ భోజనం, స్వీట్లు పంపిణీ చేశారు.

ప్రముఖుల శుభాభినందనలు

పుట్టినరోజు సందర్భంగా కుటుంబసమేతంగా తన గురువర్యులు, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి దంపతులను కుటుంబసమేతంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిశారు. భూమన ఆశీర్వచనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యక్షంగా, ఫోన్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

నియోజకవర్గ వ్యాప్తంగా...

ఎమ్మెల్యే చెవిరెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి టవర్‌ క్లాక్‌ వద్ద 25 కేజీల కేక్‌, పాకాలలో 50 కేజీల కేక్‌ కట్‌ చేశారు. అలాగే రామచంద్రాపురం, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం మండలాల్లో అన్నదానం, పండ్లు పంపిణీ కార్యక్రమాలు చేశారు.

ఎమ్మెల్యే చెవిరెడ్డికి జన్మదిన

శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు,

ఎంపీలు, ఎమ్మెల్యేలు

జిల్లా వ్యాప్తంగా కదలి వచ్చిన

పార్టీ నేతలు, కార్యకర్తలు

Advertisement
Advertisement