దేశ చరిత్రలో నిలిచిపోతాం | Sakshi
Sakshi News home page

దేశ చరిత్రలో నిలిచిపోతాం

Published Tue, Nov 14 2023 9:58 AM

- - Sakshi

ఇంధన వనరుల తరుగుదల..పర్యావరణ కాలుష్యం నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరు అభివృద్ధికి పరిశ్రమలు ఏర్పాటుపై సీఎంతో చర్చించారు. అందుకు ఆయన అంగీకరించి.. జర్మన్‌కు చెందిన పెప్పర్‌ బస్సుల తయారీ సంస్థ స్థాపనకు ఆమోదించారు. ఆ పరిశ్రమ యాజమాన్యం కూడా ఫ్యాక్టరీ స్థాపనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

పుంగనూరుకు ప్రత్యేక స్థానం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పుంగనూరుకు ప్రత్యేక స్థానం కల్పించారు. బైపాస్‌ రోడ్డు, మినీ బైపాస్‌, ఆర్టీసీ డిపో, వంద పడకల ఆస్పత్రి, ఎంబీటీ రోడ్డు విస్తరణ, పాలిటెక్నికల్‌ కళాశాల, సబ్‌స్టేషన్లతో పాటు ప్రతి గ్రామానికీ సిమెంటు రో డ్లు, కాలువలు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు ఏ ర్పాటు చేశారు. నలబైఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేపట్టాం. ప్రజలకు అ న్ని విధాల అండగా ఉంటాం. పుంగనూ రు అభివృద్ధే మా ధ్యేయం.

– రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి

రామచంద్రారెడ్డి

జగనన్నతోనే అభివృద్ధి

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎ న్నికల ముందు పాద యాత్రలో ఇచ్చిన హా మీ మేరకు పుంగనూరుకు ప్రత్యేక ని ధులు కేటాయించా రు. అభివృద్ధికి దూరమైన పుంగనూరులో అభివృద్ధి పరుగులు తీస్తోంది. రెండు రిజర్వాయర్లు, గండికోట రిజర్వాయర్‌ నుంచి పైపులైన్లతో సాగు, తాగునీరుకు లభిస్తుందన్న నమ్మకం ప్రతిఒక్కరిలోనూ ఉంది. దీంతోనే పారిశ్రామికవేత్తల పుంగనూరుకు వస్తున్నారు. పరిశ్రమల ద్వారా నిరుద్యోగ సమస్య పూర్తిగా నిర్మూలించి, పుంగనూరును ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తాం. పుంగనూరు అభివృద్ధికి సహకరిస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు.

– పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి,

ఎంపీ, రాజంపేట

పుంగనూరులో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలో తయారు చేయనున్న పెప్పర్‌ ఎలక్ట్రికల్‌ బస్సు

పుంగనూరు: పెద్దాయన సొంత నియోజకవర్గమైన పుంగనూరులో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జర్మన్‌ పెప్పర్‌ కంపెనీ ఎలక్ట్రికల్‌ బస్సుల తయారీ పరి శ్రమ స్థాపనకు తొలిసారిగా ఇక్కడికి రానుండడంతో పుంగనూరు చరిత్రకెక్కనుంది. పుంగనూరులో పరిశ్రమల ఏర్పాటు చేయాలని రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రా మచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డిలు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఇందుకు సీఎం అంగీకరించడంతో గత నెల 30న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఎలక్ట్రిక్‌ బస్సుల కంపెనీ పుంగనూరులో ఏర్పాటు కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది.

రూ.5 వేల కోట్లతో ఏర్పాటు

జర్మనీలో ఉన్న పెప్పర్‌ ఎలక్డ్రికల్‌ బస్సులు, ట్రక్కు లు, బ్యాటరీల తయారీ సంస్థ సుమారు రూ.5 వేల కోట్లతో ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించనుంది. పుంగనూరు మండలంలోని ఆరడిగుంట, మేలుందొడ్డితోపాటు పెద్దపంజాణి మండలంలోని కరసనపల్లె రెవెన్యూ గ్రామాల్లో 800 ఎకరాల్లో భూమిని కేటాయించేందు కు మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అంగీకరించారు. ప్రస్తుతం పరిశ్రమలకు కేటాయించిన రెండువేల ఎకరాల్లో ఈ పరిశ్రమ ఏర్పాటు కానున్నది. దీని ద్వారా పదివేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది.

పుంగనూరుకు నీటి లభ్యతతో..

పుంగనూరులో రాష్ట్ర విద్యుత్‌, భూగర్భ వనరుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డిలు నీటి సమస్య పరిష్కరించేందుకు పుంగనూరు మండలంలోని నే తిగుట్లపల్లె, సోమల మండలంలోని ఆవులపల్లె వద్ద రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. అలాగే వైఎస్సార్‌ జిల్లా గండికోట ప్రాజెక్టు నుంచి పైపులైన్ల ద్వారా పుంగనూరుకు నీరు పుష్కలంగా తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నా యి. దీనికితోడు కర్ణాటక సరిహద్దులోని జాతీయ రహదారులను పుంగనూరుకు అనుసంధానం చే శారు. ఫలితంగా పారిశ్రామిక వేత్తల కళ్లు పుంగనూరుపై పడేలా చేయడంలో ఎంపీ మిథున్‌రెడ్డి వి జయం సాధించారు. ఆయన ఆలోచనలు నేడు కార్యరూపం దాల్చాయి. పారిశ్రామిక వేత్తలు పుంగనూరును అనువైన ప్రాంతంగా ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికే శ్రీకాళహస్తికి చెందిన ఫెర్రో ఆలాయ్‌ పైపుల ఫ్యాక్టరీ పనులు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి.

29న సీఎం చెంతకు ప్రతినిధుల బృందం

పుంగనూరులో ఏర్పాటు చేయనున్న పెప్పర్‌ ఎలక్ట్రికల్‌ బస్సుల ఫౌండర్లు క్రిష్టియన్‌ వాగ్నర్‌, బ్యాస్టియన్‌ ఫెడ్రిచ్‌, సీఈఓ ఆండ్రియస్‌, సీఐఓ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో 12 మంది బృందం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఈనెల 29న కలసి కంపెనీ ఏర్పాట్లపై చర్చించనున్నారు.

నెలాఖరుకు పుంగనూరుకు..

పుంగనూరుకు పెప్పర్‌ ఎలక్ట్రికల్‌ బస్సుల ఫౌండర్లు క్రిష్టియన్‌ వాగ్నర్‌, బ్యాస్టియన్‌ఫెడ్రిచ్‌ తో కూడిన బృందం ఈనెలాఖరులో పుంగనూరులో పర్యటిస్తారని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. కంపెనీ భూసేకరణకు సంబంధించి వివరాలు వెల్లడిస్తారన్నారు. త్వరలోనే కంపెనీ నిర్మాణ పనులను సీఈఓ ఆండ్రియస్‌, సీఐఓ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు.

2027నాటికి 50 వేల వాహనాలు

జర్మన్‌ పెప్పర్‌ పరిశ్రమ

స్థాపనకు గ్రీన్‌ సిగ్నల్‌

ముఖ్యమంత్రి జగన్‌కు పెప్పర్‌ కృతజ్ఞతలు

29న సీఎంతో సమావేశం

రూ.5వేల కోట్లతో

పెప్పర్‌ ఎలక్ట్రికల్‌ బస్సుల తయారీ

2027కు మార్కెట్‌లోకి

50 వేల వాహనాలు

మరో 10 అనుబంధ కంపెనీలు రాక

పదివేల మంది నిరుద్యోగులకు ఉపాధి

దేశ వ్యాప్తంగా పుంగనూరుకు గుర్తింపు

పుంగనూరు మండలం ఆరడిగుంటలో జర్మనీ ఎలక్ట్రికల్‌ బస్సుల కంపెనీ నెలకొల్పేందుకు ముందుకు రావడం పుంగనూరు ప్రజల అదృష్టమని, దేశ చరిత్రలో పుంగనూరు పేరు నిలిచిపోతుందని పీకేఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యా దవ్‌ తెలిపారు. సోమవారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి కృషితో పుంగనూరు పారిశ్రామికాభివృద్ధి చెందుతోందన్నారు. 40 ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగన్నరేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంత్రి కుటుంబం చేసి చూపిందన్నారు. ప్రభుత్వానికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అమ్ము, పార్టీ నాయకులు కొత్తపల్లె చెంగారెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, జయరామిరెడ్డి, సుబ్రమణ్యం, రాజేష్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో పెప్పర్‌ ఎలక్ట్రికల్‌ బస్సుల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి, 2027 సంవత్సరం నాటికి సుమారు 50 వేల బస్సులు, ట్రక్కులతో మార్కెట్‌లోకి విడుదల చేయడానికి కంపెనీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన సిబ్బంది, ముడిసరుకు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోనున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.

1/6

2/6

3/6

4/6

5/6

6/6

Advertisement
Advertisement