కోనలో వైభవంగా రఽథోత్సవం | Sakshi
Sakshi News home page

కోనలో వైభవంగా రఽథోత్సవం

Published Tue, Nov 14 2023 9:58 AM

కోన మాడవీధుల్లో  రఽథంపై 
ఊరేగుతున్న స్వామి, అమ్మవార్లు   - Sakshi

రాపూరు: శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వాతి నక్షత్రం, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రఽథోత్సవం ఆర్టీసీ బస్టాండు వరకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన నరకాసురుని ప్రతిమను స్వామివారి విల్లుతో దహనం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ జనార్దన్‌రెడ్డి, ప్రధానార్చకులు రామయ్యస్వామి, పెంచలయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 6 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 74,807 మంది స్వామివారిని దర్శించుకోగా 21,974 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.58 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

నేటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

తిరుపతి అర్బన్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల్లో మంగళవారం నుంచి 20వ తేదీ వరకు 56వ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నట్టు తిరుపతి ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయ గెజిటెడ్‌ అధికారి వెన్నేటి సూర్యనారాయణమూర్తి తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. వారోత్సవాల సందర్భంగా పాఠకులు తీసుకున్న పుస్తకాలకు గడువు దాటినా అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. 20వ తేదీ తర్వాత పుస్తకాలు ఇస్తే అదనపు రుసం చెల్లించాలని చెప్పారు.

విజేతలకు బహుమతులు

గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని గ్రంథాలయాల్లో పలు పోటీలు నిర్వహించడంతోపాటు విజేతలకు బహుమతులు అందిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ నైనార్‌ మధుబాల తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వారికి వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

కార్తీక మాసోత్సవాలు ప్రారంభం

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం కార్తీక మాసోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. కార్తీక మాసోత్సవాల్లో మొదటిరోజు ఆలయ అర్చకులు ఆకాశదీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి పాల్గొన్నారు. అనంతరం ఆకాశదీపాన్ని ప్రత్యేక స్తంభానికి పైభాగంలో ఆకాశంవైపుగా వేలాడుతుండేలా ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో సాగర్‌బాబు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు

ఆకాశదీపాన్ని వేలాడదీస్తున్న ఎమ్మెల్యే
 సతీమణి శ్రీవాణి, ఆలయ చైర్మన్‌ శ్రీనివాసులు
1/2

ఆకాశదీపాన్ని వేలాడదీస్తున్న ఎమ్మెల్యే సతీమణి శ్రీవాణి, ఆలయ చైర్మన్‌ శ్రీనివాసులు

వెన్నేటి సూర్య
నారాయణమూర్తి
2/2

వెన్నేటి సూర్య నారాయణమూర్తి

Advertisement
Advertisement