ప్రతి అర్జీకి పరిష్కారం చూపండి | Sakshi
Sakshi News home page

ప్రతి అర్జీకి పరిష్కారం చూపండి

Published Tue, Nov 21 2023 1:30 AM

అర్జీదారులతో మాట్లాడుతున్న అధికారులు - Sakshi

తిరుపతి అర్బన్‌: స్పందనకు వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని డీఆర్వో పెంచల కిషోర్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి మొత్తం 147 అర్జీలు వచ్చినట్టు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా 113 అర్జీలు రెవెన్యూశాఖకు చెందినవే ఉన్నాయన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే చేపడుతోందని, సర్వే పూర్తయిన తర్వాత రెవెన్యూ సమస్యలు నామమాత్రంగా మిగులుతాయని వెల్లడించారు. స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్లు శ్రీనివాసులు, భాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 20 కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 79,800 మంది స్వామివారిని దర్శించుకోగా 25,962 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.55 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement