డిజైన్‌ను బట్టి రేటు | Sakshi
Sakshi News home page

డిజైన్‌ను బట్టి రేటు

Published Wed, Nov 22 2023 12:34 AM

-

చీరలకు కావాల్సిన ముడిసరుకును షావుకారి(ఏజెన్సీ) వద్ద తెచ్చుకుంటున్నారు. ఒక షాపునకు అంటే నాలుగు చీరలకు సరిపడా ముడిసరుకుకు రూ.20 వేల వరకు అవుతుంది. ఆయా సరుకును కొందరు ఏజెన్సీలు తెచ్చి ఇస్తుంటారు. మరికొందరు సొంతంగా కొనుగోలు చేసి చీరలు నేసి ఏజెన్సీలకు విక్రయిస్తున్నారు. ఇలా భార్యాభర్త డిజైన్‌ను బట్టి వారం పది రోజులు మగ్గం నేస్తే నాలుగు చీరలు పూర్తవుతాయి. దీనికి ఒక్కో చీరకు ఖర్చు పోను రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు గిట్టుబాటు అవుతుంది. ఏజెన్సీల ద్వారా అమెరికా, తమిళనాడు, తెలంగాణతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇటీవల సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు ఎక్కువగా నేత చీరలను కొనుగోలు చేస్తున్నట్టు నేత కార్మికులు చెబుతున్నారు.

Advertisement
Advertisement