వైద్యుల సలహా మేరకే మందుల వినియోగం | Sakshi
Sakshi News home page

వైద్యుల సలహా మేరకే మందుల వినియోగం

Published Fri, Nov 24 2023 1:12 AM

-

తిరుపతి అర్బన్‌: వైద్యుల సలహా మేరకే మందులు వినియోగించాలి కలెక్టర్‌ కే.వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం అధికారులతో కలిసి ప్రపంచ యాంటీ మైక్రోబియల్‌ అవేర్నెస్‌ వీక్‌ బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బ్యాక్టీరియా వైరస్‌లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు కాలక్రమేణా మారినప్పుడు వచ్చే వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీహరి, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ అరుణ సులోచన, డీపీఎంవో శ్రీనివాసులు, డాక్టర్‌ తేజ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 65,891 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,896 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపేణా హుండీలో రూ.4.04 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా.. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement