డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సు | Sakshi
Sakshi News home page

డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సు

Published Fri, Nov 24 2023 1:12 AM

మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ శంకరశర్మ  - Sakshi

సూళ్లూరుపేట: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫిజిక్స్‌ ఆనర్స్‌ విత్‌ రీసెర్చ్‌ అనే కొత్త కోర్సును ప్రారంభించినట్టు ప్రిన్సిపాల్‌ ఎస్‌ఎల్‌బీ శంకరశర్మ తెలిపారు. కళాశాలలోని కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం కొత్త కోర్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి కోర్సుకు రాష్ట్రంలోని మూడు కళాశాలలకు మాత్రమే అనుమతి లభించిందన్నారు. ఈ విద్యా సంవత్సరానికి 10 సీట్లు మాత్రమే కేటాయించినట్టు తెలిపారు. ఫిజిక్స్‌ విభాగాధిపతి వీ.రాజా మాట్లాడుతూ ఈ కోర్సులో ఉత్తీర్ణులైన తరువాత నేరుగా పీహెచ్‌డీ, ఎంటెక్‌ కోర్సులు చేయవచ్చని చెప్పారు. విదేశాల్లో ఎంఎస్‌ చేయవచ్చన్నారు. ఈ డిగ్రీతో ట్రిపుల్‌ ఐటీ, జూనియర్‌, రెసిడెన్సియల్‌, పాలిటెక్నిక్‌ కశాశాలల్లో అధ్యాపకులుగా ఉద్యోగావకాశాలు ఉంటాయ న్నారు. సీనియర్‌ అధ్యాపకులు వరప్రసాద్‌, ఎస్‌.శ్రీనివాస్‌, ఉషారాణి, సుబ్రమణ్యంశాస్త్రి, పీ.ఏడుకొండలు, ఏ.బాబు పాల్గొన్నారు.

26 నుంచి సంకల్ప యాత్ర

తిరుపతి అర్బన్‌: కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర ఈనెల 26 నుంచి జనవరి 26 నిర్వహించనున్నట్టు కేంద్ర పరిశీలకుడు ప్రకాష్‌ పిచ్చ్‌ తెలిపారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లోని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి డీపీవో రాజశేఖర్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 60 రోజుల పాటు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర దేశ వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. తిరుపతి జిల్లాలోనూ 60 రోజుల పాటు వికసిత్‌ భారత్‌ యాత్ర ఉంటుందన్నారు.

డీఎల్‌డీఓతోపాటు పంచాయతీ అధికారులు
1/1

డీఎల్‌డీఓతోపాటు పంచాయతీ అధికారులు

Advertisement
Advertisement