ఆధ్యాత్మిక క్షేత్రంగా మహేశ్వరం | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక క్షేత్రంగా మహేశ్వరం

Published Sat, May 27 2023 6:14 AM

-

మహేశ్వరం: మహేశ్వరాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కేసీ తండా కొత్వాల్‌ చెరువు కట్టపై ఏర్పాటు చేసిన 40 అడుగుల భారీ మహేశ్వరుడి విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 8 పురాతన ఆలయాల్లో ఒక్కో ఆలయ అభివృద్ధికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.8 కోట్లు మంజూరు చేయించినట్టు తెలిపారు. మహేశ్వరంలో గడికోట, మెట్ల బావి, రాజరాజేశ్వర ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉదయం ఇంద్రారెడ్డి ట్రస్టు చైర్మన్‌ కార్తీక్‌రెడ్డి, కళ్యాణ్‌రెడ్డి దంపతులు భారీ శివుడి విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సునితా నాయక్‌, కేసీ తండా సర్పంచ్‌ జాటోత్‌ మోతిలాల్‌ నాయక్‌, జిల్లా రైతు కమిటీ సభ్యుడు యాదయ్య ఉన్నారు.

Advertisement
Advertisement