మిత్తీ మరిచారు! | Sakshi
Sakshi News home page

మిత్తీ మరిచారు!

Published Wed, Oct 4 2023 7:48 AM

మోమిన్‌పేటలో మహిళా సమాఖ్య సమావేశం - Sakshi

పరిమితి పెంచారు..

తీసుకున్న రుణాలు

2019–20లో 477 మహిళా సంఘాలు రూ.13.67కోట్ల రుణం తీసుకున్నాయి. 2020–21లో 735 సంఘాలు రూ.20.15కోట్లు తీసుకోగా.. 2021–22లో 706 సంఘాలు 38.34కోట్లు, 2022–23లో 371 సంఘాలు 26.72కోట్ల రుణం తీసుకున్నాయి.

రావాల్సిన వడ్డీ..

2019–20 వడ్డీలేని రుణం తీసుకున్న సంఘాలు 749. వారికి రావాల్సిన వడ్డీ రూ.2.05కోట్లు. 2020–21లో 796 సంఘాలకు గాను రూ.1.76కోట్లు, 2021–22లో 747 సంఘాలకు 2.07కోట్లు, 2022–23లో 810 సంఘాలకు రూ.3.06కోట్ల వడ్డీ ప్రభుత్వం అందించాల్సి ఉంది. దీంతో పలువురు మహిళలు మాట్లాడుతూ ఇలా రుణ పరిమితి పెంచి, రుణాలు ఇచ్చిన ప్రభుత్వం.. వడ్డీ చెల్లించడం మరిచిందని, ఎప్పటికప్పుడు మహిళా సంఘాలకు చెల్లించాలని కోరుతున్నారు.

మోమిన్‌పేట: ‘డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. మిత్తిలేని రుణాలను అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు నందించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని చెప్పి నాలుగున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ.. నేటికీ అతీగతి లేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న రుణానికి యేటా వడ్డీలు కట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. ‘తీసుకున్న అప్పుకు ప్రస్తుతం మీరు వడ్డీ కట్టండి. ప్రభుత్వం చెల్లించిన పిదప మీమీ ఖాతాలో జమ చేస్తాం’ అని బ్యాంకు అధికారులు చెబుతూ.. మా వద్ద వడ్డీ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మిత్తిసకాలంలో చెల్లిస్తే తమకు న్యాయం జరుగుతుందని, ఏళ్లుగా పేరుకుపోయిన తర్వాత ఇస్తే ప్రయోజనం ఏముంటుందని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

సర్కారు చెల్లించాల్సిన వడ్డీ రూ.92కోట్లు

రుణ పరిమితి సంఘానికి రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకు పెంచారు. కానీ నాలుగున్నరేళ్లుగా వడ్డీలు చెల్లించడం లేదని, జిల్లాలోని 19 మండలాల్లో 2019–20 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వాల్సిన వడ్డీ రూ.92కోట్లకు పైగానే ఉందని సభ్యులు పేర్కొంటున్నారు. మోమిన్‌పేట మండల పరిధి గ్రామాల్లో 838 డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం అందించాల్సిన బకాయి నాలుగున్నరేళ్ల్లుగా చెల్లించకపోవడంతో రూ.9.50కోట్లకు పేరుకు పోయిందని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. బ్యాంకు రుణాలు, స్రీనిధి నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీలు తామే చెల్లిస్తున్నామని మహిళలు చెప్పారు.

నాలుగున్నరేళ్లుగా వడ్డీ చెల్లించని సర్కారు

పెదవి విరుస్తున్న డ్వాక్రా మహిళలు

బ్యాంకులకు వడ్డీ కడుతున్న సభ్యులు

రుణ ఖాతాలో జమ..

ప్రభుత్వం చెల్లించే వడ్డీ.. డ్వాక్రా సంఘాల రుణ ఖాతాలో జమ చేస్తారు. నేరుగా బ్యాంకులకు ప్రభుత్వం అందిస్తుంది. పూర్తిగా ఆన్‌లైన్‌ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు సంఘాల పని తీరు,రుణాలను తిరిగి చెల్లించడం తెలిసిపోతుంది. నాలుగున్నరేళ్లుగా బకాయి పేరుకుపోయింది.

– రాజు, ఏపీఎం, మోమిన్‌పేట

1/1

Advertisement
Advertisement