రూ.5లక్షల నగదు పట్టివేత | Sakshi
Sakshi News home page

రూ.5లక్షల నగదు పట్టివేత

Published Fri, Oct 27 2023 6:48 AM

-

మోమిన్‌పేట: మోమిన్‌పేటలో గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి బైక్‌పై రూ.5లక్షల నగదు తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. మోమిన్‌పేటకి చెందిన కృష్ణగౌడ్‌ ఎలాంటి ఆధారాలు చూపకుండా నగదు తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కోడ్‌ నిబంధనలకు లోబడే ఎవరైనా నగదు తీసుకెళ్లాలన్నారు. నగదుకు సంబంధించి పత్రాలు తప్పక చూపించాలన్నారు. లేనిపక్షంలో సీజ్‌ చేస్తామన్నారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

మోమిన్‌పేట: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మోమిన్‌పేటలో గురువారం చోటుచేసుకొంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు.. మర్పల్లి మండలం బూచన్‌పల్లికి చెందిన నాగెడపల్లి లింగయ్య(55) మోమిన్‌పేటలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. లింగయ్య మోమిన్‌పేటలోని సంగమేశ్వర ఆలయ దగ్గర ఉన్న వెంచర్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఈనెల 17న డబుల్‌ డ్యూటీ చేయడంతో ఇంటికి రాలేదు. 18వ తేదీన ఉదయం భార్య కవిత ఫోన్‌ చేయగా జిల్లేడు పాలు తాగి నేను చనిపోతున్నాని పేర్కొనగా వెంటనే అక్కడికి చేరుకొని సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి లింగయ్య మృతి చెందాడు. మృతుడి కూతురు నక్షత్ర ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

కాంట్రాక్టర్‌పై మేనేజర్‌ దాడి

తాండూరు రూరల్‌: మండల పరిధిలోని కరన్‌కోట్‌ శివారులో ఉన్న సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆప్‌ ఇండియా (సీసీఐ)లో హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అమిత్‌రంజన్‌ దురుసుగా ప్రవర్తించారు. బుధవారం సీసీఐ ఫ్యాక్టరీలో వంట కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న కృష్ణపై అమిత్‌రంజన్‌ విచక్షణా రహితంగా దాడిచేశారు. ఈ సంఘటన సీసీఐ ఫ్యాక్టరీలో చర్చనీయంశంగా మారింది. ఈ విషయమై తాండూరు పోలీస్‌ స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. హెచ్‌ఆర్‌ మేనేజన్‌ అమిత్‌రంజన్‌ మద్యం మత్తులో సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు చాలా ఉన్నాయని కార్మికులు చెప్పారు.

Advertisement
Advertisement