నష్టపోయిన రైతులకు న్యాయం

14 Nov, 2023 04:18 IST|Sakshi
పూడూరు: టీఆర్‌ఆర్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరుతున్న నాయకులు
● అధికారంలోకి రాగానే ఏకకాలంలో రుణ మాఫీ ● డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి

పూడూరు: బీఆర్‌ఎస్‌ పాలనలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్‌ డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పరిగి అభ్యర్థి టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని తిమ్మాపూర్‌, కొత్తపల్లి, చీలాపూర్‌, మన్నేగుడ, పూడూరు, గొంగుపల్లి, మేడికొండ తదితర గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. వైఎస్‌ఆర్‌ పాలనలో అర్హులందరికి ఇందిరమ్మ ఇల్లు, పింఛన్‌లు, ఆరోగ్య శ్రీ ద్వారా కార్పొరేట్‌ వైద్యం అందించారని గుర్తుచేశారు. ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీ నాయకులు హస్తం గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, మాజీ చైర్మన్‌ నర్సింహారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆనందం, డీసీసీ కార్యదర్శులు శ్రీనివాస్‌, పెంటయ్య, అజీం పటేల్‌, నాయకులు రఘునాథ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్‌, సల్మాతాజొద్దీన్‌, మహిళా అధ్యక్షురాలు బాలమణి, కలీల్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రజావ్యతిరేక పాలనను అంతమొందించాలి

దోమ: రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజావ్యతిరేకపాలనను ప్రజలు అంతమెందించాలని డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి సతీమణి ఉమారెడ్డి అన్నారు. సోమవారం ఆమె మండల పరిధిలోని మల్లేపల్లితండాలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పథకాలన్నీ వారి పార్టీ నేతలకే అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలు అమలు చేసి అర్హులందరికీ అందజేస్తామన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి టీఆర్‌ఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మోసపోతే గోసపడుతాం

కుల్కచర్ల: ప్రజలు బీఆర్‌ఎస్‌ మాటలు నమ్మి మోసపోతే.. ఐదేళ్లు గోసపడుతామని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కాంగ్రెస్‌ పరిగి అభ్యర్థి తనయుడు రితీక్‌రెడ్డి అన్నారు. సోమవారం వారు మండల పరిధిలతోని పుట్టపహాడ్‌లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఓటుతో బీఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, బ్లాక్‌ టు అధ్యక్షుడు కర్రె భరత్‌ కుమార్‌, మండల ప్రధాన కార్యదర్శి గోపాల్‌ నాయక్‌, ఉపాధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, నాయకులు స్వామి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు