రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు.. | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు..

Published Sat, Nov 18 2023 6:34 AM

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై న
కొడంగల్‌ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు  - Sakshi

విద్యార్థుల ఎంపిక

కొడంగల్‌: పట్టణ శివారులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. 67వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 16న జరిగిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థాయి అండర్‌ –14 కబడ్డీ పోటీల్లో శౌమిక్‌, అండర్‌ –17 విభాగంలో రాఘవేంద్ర, భాస్కర్‌, వెంకటేష్‌ ఎంపికయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని ప్రధానోపాధ్యాయుడు శంకర్‌బాబు, పీఈటీ పరశురాముడు, ఉపాధ్యాయులు తెలిపారు.

కంకల్‌ పాఠశాల నుంచి..

పూడూరు: ఇటీవల కీసరలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ అంతర్‌ జిల్లా స్థాయి అండర్‌ –14 బాలికల విభాగం కబడ్డీ పోటీల్లో మండలంలోని కంకల్‌ జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థినులు విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కంకల్‌ పాఠశాలకు చెందిన డీ అర్చన, సాయిప్రగతి, బాలుర విభాగంలో మోడల్‌ స్కూల్‌ విద్యార్థి చరణ్‌, సంతోష్‌ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీదేవి తెలిపారు. కలా ఉత్సవ్‌ కాంపిటీషన్‌లో మ్యూజిక్‌ ప్లూట్‌లో వజ్రనిర్గోష రాష్ట్రస్థాయిలో 3వ బహుమతిని అందుకున్నట్లు తెలిపారు. ప్రతిభచాటిన విద్యార్థులను పాఠశాల అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంతోష, పాఠశాల హెచ్‌ఎం చంద్రశేఖర్‌రెడ్డి, పీఈటీ సత్తయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్‌ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement