కాంగ్రెస్‌తోనే గిరిజనులకు మేలు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే గిరిజనులకు మేలు

Published Thu, Nov 23 2023 4:28 AM

గిరిజనులకు గ్యారెంటీలను వివరిస్తున్న రాఘవన్‌   - Sakshi

అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాఘవన్‌ నాయక్‌

మర్పల్లి: తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పదేళ్లు అవుతు న్నా తండాలు అభివృద్ధికి నోచుకోలేదని అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాఘవన్‌ నాయక్‌ ఆరోపించారు. బుధవారం ఆయన మండల పరిధిలోని పట్లూర్‌, మర్పల్లి, గుర్రంగట్టు తండాలలో కాంగ్రెస్‌ వికారాబాద్‌ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ తండాల అభివృద్ధిని విస్మరించాన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని, అసైన్డ్‌ భూములు ఇచ్చారని గుర్తు చేశారు. గిరిజనులకు మేలు చేసిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చి నా అభివృద్ధి పనుల కోసం నిధులు ఇవ్వక పోవడంతో పరిస్థితి దయానీయంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌, కౌన్సిలర్‌ చందర్‌నాయక్‌, మాజీ సర్పంచ్‌ పాండునాయక్‌, సేవాలాల్‌ సేనా అధ్యక్షుడు రమేశ్‌, నాయకు లు ధరమ్‌సింగ్‌, పరుషరామ్‌, గోవర్ధన్‌, గోపాల్‌, రాంచందర్‌, సంతోష్‌, శేఖర్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement