‘జీరో టికెట్‌’ తీసుకోవాల్సిందే | Sakshi
Sakshi News home page

‘జీరో టికెట్‌’ తీసుకోవాల్సిందే

Published Sat, Dec 16 2023 4:24 AM

ఫ్రీ టికెట్‌ తీసుకుంటున్న మహిళ - Sakshi

బొంరాస్‌పేట: కొత్త సర్కారు మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పింది. వారం రోజులుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. శుక్రవారం నుంచి అన్ని ఆర్టీసీ డిపో అధికారుల ఆదేశాల మేరకు ‘జీరో టికెట్‌’కు ఆధార్‌ తప్పనిసరిగా మహిళలు చూపించాలని నిబంధనలు అమలు చేస్తోంది. మహిళలకు అమలవుతున్న ‘ఫ్రీ టికెట్‌’ను ప్రతీ తెలంగాణ మహిళ తీసుకోవాల్సిందేనని కండక్టర్లు సూచించారు. ఆధార్‌ కార్డు చూపించి ఫ్రీ టికెట్‌ పొందాలని మహిళా ప్రయాణికుల్ని కోరుతున్నారు. టికెట్‌ తీసుకోని ఎడల తనిఖీ అధికారులు రూ.500 జరిమానా విధిస్తారని హెచ్చరిస్తున్నారు. ఈ విధానం శుక్రవారం నుంచి అమలులోకి వచ్చిందంటున్నారు.

లేదంటే రూ.500 జరిమానా

Advertisement
Advertisement