స్టేట్‌ యూత్‌ మెన్‌ బాక్సింగ్‌ చాంప్‌ విశాఖ | Sakshi
Sakshi News home page

స్టేట్‌ యూత్‌ మెన్‌ బాక్సింగ్‌ చాంప్‌ విశాఖ

Published Tue, May 23 2023 3:10 AM

 విజేతగా నిలిచిన విశాఖ జట్టు 
 - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: 6వ యూత్‌ మెన్‌ అంతర జిల్లాల బాక్సింగ్‌ పోటీల్లో టీమ్‌ చాంపియన్‌షిప్‌ను విశాఖ జట్టు కై వసం చేసుకుంది. విజయనగరం జట్టు 14 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. డీఆర్‌ఎం కప్‌ పేరిట రైల్వే బాక్సింగ్‌ హాల్‌లో 13 వెయిట్‌ కేటగిరిల్లో పోటీలు నిర్వహించారు. బెస్ట్‌ బాక్సర్‌గా బాంటమ్‌ వెయిట్‌లో వి.పవన్‌(అనంతపురం) నిలవగా... బెస్ట్‌ లూజర్‌గా బాంటమ్‌ వెయిట్‌లోనే బి.ప్రసాద్‌(విశాఖ) నిలిచాడు. ఈ చాంపియన్‌షిప్‌లో ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన యూత్‌ బాక్సర్లు పోటీ పడగా.. ఆయా కేటగిరిల్లో విజేతగా నిలిచిన బాక్సర్లను ఏపీ యూత్‌ మెన్‌ జట్టుగా ఎంపిక చేసి త్వరలో జరగనున్న అంతర్రాష్ట మెన్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌కు అర్హత కల్పించనున్నారు. ఫైనల్‌ లూజర్లు స్టాండ్‌బైగా నిలవనున్నారు. పోటీల ముగింపు కార్యక్రమానికి డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి హాజరై విజేతలకు ట్రోఫీలందించారు.

విజేతలు వీరే...

● 45–48 కేజీల మినిమమ్‌ వెయిట్‌ కేటగిరిలో బి.వాసుదేవపాత్రుడు (విశాఖ) విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా ఎస్‌.తేజేశ్వర్‌(విజయనగరం) ద్వితీయ స్థానంలో నిలిచి రజతపతకాన్ని అందుకున్నాడు. కె.కృష్ణ(శ్రీకాకుళం), డి.రామనిద్దిన్‌ (నెల్లూరు) ఉమ్మడిగా తృతీయ స్థానంలో నిలిచి కాంస్యాలందుకున్నారు.

● 48–51 కేజీల ఫ్లై వెయిట్‌ కేటగిరిలో కె.లోహిత్‌(విశాఖ) విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా వి.మున్నా(చిత్తూరు) ద్వితీయ స్థానంలో నిలిచి రజతపతకాన్ని అందుకున్నాడు.

● 51–54 కేజీల బాంటమ్‌ వెయిట్‌ కేటగిరిలో వి.పవన్‌(అనంతపురం) విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా ద్వితీయ స్థానంలో బి.ప్రసాద్‌(విశాఖ) నిలిచి రజతపతకాన్ని అందుకున్నాడు. చంద్రశేఖర్‌(విజయనగరం), అభిజ్ఞాన్‌ సుందర్‌(నెల్లూరు) ఉమ్మడిగా తృతీయ స్థానంలో నిలిచి కాంస్యాలందుకున్నారు.

● 54–57 కేజీల ఫెదర్‌ వెయిట్‌ కేటగిరిలో జె.బాలగణేష్‌రెడ్డి (విశాఖ) విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా వి.మధు(శ్రీకాకుళం) ద్వితీయ స్థానంలో నిలిచి రజతపతకాన్ని అందుకున్నాడు. వై.హరీష్‌(అనంతపురం), కె.రవితేజ(విజయనగరం) ఉమ్మడిగా తృతీయ స్థానంలో నిలిచి కాంస్యాలందుకున్నారు.

● 57–60 కేజీల లైట్‌ వెయిట్‌ కేటగిరిలో పి.దిగ్విజయ్‌ (విశాఖ) విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా ఎల్‌.వాసు(నెల్లూరు) ద్వితీయ స్థానంలో నిలిచి రజతపతకాన్ని అందుకున్నాడు. కె.సిద్దిక్‌(ప్రకాాశం), గగన్‌ శ్రీహర్ష(కడప) ఉమ్మడిగా తృతీయ స్థానంలో నిలిచి కాంస్యాలందుకున్నారు.

● 60–63.5 కేజీల లైట్‌ వెల్టర్‌ వెయిట్‌ కేటగిరిలో జె.భానుప్రకాష్‌ (విశాఖ) విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా షేక్‌ మహ్మాద్‌ ఆసిఫ్‌(ప్రకాశం) ద్వితీయ స్థానంలో నిలిచి రజతపతకాన్ని అందుకున్నాడు. నందగోపాల్‌(పశ్చిమగోదావరి), వేణుమాధవ్‌(శ్రీకాకుళం) ఉమ్మడిగా తృతీయ స్థానంలో నిలిచి కాంస్యాలందుకున్నారు.

● 63.5–67 కేజీల వెల్టర్‌ వెయిట్‌ కేటగిరిలో ఎన్‌.హర్షవర్థన్‌ (విశాఖ) విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా ఎన్‌.దిలీప్‌కుమార్‌ (నెల్లూరు) ద్వితీయ స్థానంలో నిలిచి రజతపతకాన్ని అందుకున్నాడు. జెహథన్‌(పశ్చిమగోదావరి), హేమంత్‌(కర్నూలు) ఉమ్మడిగా కాంస్యాలందుకున్నారు.

● 67–71 కేజీల లైట్‌మిడిల్‌ వెయిట్‌ కేటగిరిలో వై.ప్రభాస్‌వర్ధన్‌(విశాఖ) విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా బి.తృణ(శ్రీకాకుళం) ద్వితీయ స్థానంలో నిలిచి రజతపతకాన్ని అందుకున్నాడు. మనోజ్‌(విజయనగరం), జోగంధర్‌ ఉమ్మడిగా కాంస్యాలందుకున్నారు.

● 71–75 కేజీల మిడిల్‌ వెయిట్‌ కేటగిరిలో ఎ.అశోక్‌కుమార్‌(విశాఖ)విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా ఎస్‌.మోహన్‌రావు(విజయనగరం) ద్వితీయ స్థానంలో నిలిచి రజతపతకాన్ని అందుకున్నాడు. ధనుష్‌(నెల్లూరు), హరీష్‌(శ్రీకాకుళం) ఉమ్మడిగా కాంస్యాలందుకున్నారు.

● 75–80 కేజీల లైట్‌ వెయిట్‌ కేటగిరిలో కె.దుర్గాప్రసాద్‌(విజయనగరం)విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా ఆయుష్‌పూర్తి(చిత్తూరు) ద్వితీయ స్థానంలో నిలిచి రజతపతకాన్ని అందుకున్నాడు. ఽపూర్ణచంద్రశేఖర్‌(కర్నూలు), దిల్లేశ్వర్‌(శ్రీకాకుళం) ఉమ్మడిగా కాంస్యాలందుకున్నారు.

● 80–86 కేజీల క్రూయిజర్‌ వెయిట్‌ కేటగిరిలో పి.దేవ్‌కుమార్‌(విజయనగరం) విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా కె.రాము(విశాఖ) ద్వితీయ స్థానంలో నిలిచి రజతపతకాన్ని అందుకున్నాడు. ఽసాయిసందీప్‌(నెల్లూరు), అభిషేక్‌(కర్నూలు) ఉమ్మడిగా కాంస్యాలందుకున్నారు.

● 86–92కేజీల హెవీ వెయిట్‌ కేటగిరిలో బి.చంద్రశేఖర్‌(విజయనగరం) విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా ఆషిక్‌ గౌస్‌(ప్రకాశం) ద్వితీయ స్థానంలో నిలిచి రజతపతకాన్ని అందుకున్నాడు.

● 92 కేజీల సూపర్‌ హెవీ వెయిట్‌ కేటగిరిలో శ్రీహర్ష భగవాన్‌(చిత్తూరు) విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా ప్రియదేవ్‌(విశాఖ) ద్వితీయ స్థానంలో నిలిచి రజతపతకాన్ని అందుకున్నాడు.

రన్నరప్‌గా విజయనగరం

బెస్ట్‌ బాక్సర్‌గా పవన్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement