22న జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం | Sakshi
Sakshi News home page

22న జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం

Published Wed, Sep 20 2023 12:36 AM

-

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం ఈ నెల 22న నిర్వహించనున్నారు. నగర మేయర్‌, స్థాయీ సంఘ చైర్‌పర్సన్‌ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశ మందిరంలో ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి నిర్వహించనున్న సమావేశంలో 20 అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి. వీటిలో ప్రధానంగా గాజువాక జోన్‌ 77వ వార్డులో పెదపాలెం నుంచి చినపాలెం వరకు రూ.49.60 లక్షలతో బీటీ రోడ్డు మరమ్మతులు, విస్తరణ, అలాగే రూ.49.90 లక్షలతో చినపాలెం నుంచి పిట్టవానిపాలెం వరకు బీటీ రోడ్డు మరమ్మతులు, విస్తరణ, 65వ వార్డులో రూ.49.95 లక్షలతో భానోజీ కాలనీలో మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం, రూ.49.84 లక్షలతో అశోక్‌నగర్‌రావు నంబర్‌–1 వద్ద రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం, రూ.37.65 లక్షలతో వికాస్‌నగర్‌ నివాసితుల సంక్షేమ సంఘం బిల్డింగ్‌ పునరుద్ధరణ, రూ.35 లక్షలతో 87వ వార్డు వడ్లపూడి రాజులపాలెం పార్కులో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం, రూ.49.95 లక్షలతో 69వ వార్డు నాతయ్యపాలెం కల్యాణమండపం మొదటి అంతస్తు నిర్మాణం, రూ.49.78 లక్షలతో నాతయ్యపాలెం బంగారమ్మ గుడి నుంచి కిమ్స్‌ ఐకాన్‌ హాస్పటల్‌ వరకు హాట్‌మిక్స్‌ ప్రక్రియ ద్వారా బీటీ రోడ్డుకు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి. జోన్‌–4 పరిధి 28 నుంచి 39వ వార్డుల వరకు, జోన్‌–5 పరిధి 40 నుంచి 63వ వార్డుల వరకు పారిశుధ్య నిర్వహణకు అదనపు సిబ్బందిని కొనసాగించేందుకు, మలేరియా, డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవలకు 30 మంది స్ప్రేయింగ్‌ వర్కర్స్‌ను రోజుకూలీ కింద సెప్టెంబర్‌ ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగించేందుకు, జోన్‌–4 పరిధి జగదాంబ వాణిజ్య సముదాయంలో గల 1, 2 దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వ చేనేత, జౌళిశాఖకు రెండేళ్ల కాలానికి ఇవ్వడం తదితర అంశాలు చర్చకు రానున్నాయి.

Advertisement
Advertisement