నాలుగో తరగతి సిబ్బందికి దుస్తుల పంపిణీ | Sakshi
Sakshi News home page

నాలుగో తరగతి సిబ్బందికి దుస్తుల పంపిణీ

Published Sat, Oct 21 2023 12:16 AM

● ధనలక్ష్మి - Sakshi

● సరస్వతీ నమస్తుభ్యం.. వీణాపుస్తకధారిణీం..

కంచరపాలెం: ఎర్నిమాంబ అమ్మవారి ని, ఆలయ గర్భగుడిని సుమారు 9 లక్షల గాజులతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి

అమ్మవారి ని దర్శించుకున్నారు.

స్టీల్‌ప్లాంట్‌: ఉక్కునగరంలోని త్రిశక్తి ఆలయంలో ధనలక్ష్మి అలంకరణలో శ్రీ మహాలక్ష్మి భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు లక్ష రూపాయల రూ.100, 50, 20, 10 కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు.

చెల్లని చెక్కు జారీ చేసిన వ్యక్తికి ఏడాది జైలు

విశాఖ లీగల్‌: చెల్లని చెక్కు జారీ చేసిన సాయిజీరావుకు ఏడాది జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ నగరంలోని ఏడవ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ శుక్రవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించిన పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. వివరాలివీ.. నిందితుడు సింహాద్రి సాయిజీరావు ద్వారకానగర్‌లో ఉంటున్నాడు. ఫిర్యాది శ్రీధర్‌, సాయిజీరావు స్నేహితులు. ఈ నేపథ్యంలో శ్రీధర్‌.. అతనికి రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చారు. అప్పు తీర్చే నిమిత్తం 2019లో సాయిజీరావు రూ.10 లక్షల చెక్‌ను శ్రీధర్‌కి ఇచ్చాడు. ఆ చెక్కును శ్రీధర్‌ తన ఖాతాలో జమ చేయగా తగినన్ని నిధులు లేని కారణంగా బౌన్స్‌ అయింది. దీంతో శ్రీధర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు.

మహారాణిపేట: విజయదశమి పురస్కరించుకుని కలెక్టరేట్‌ నాలుగో తరగతి, సెక్యూరిటీ, పారిశుధ్య సిబ్బందికి కలెక్టర్‌ ఎ.మల్లికార్జున దుస్తులు, మిఠాయి లు పంపిణీ చేశారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలంతా విజయదశమిని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని అన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌, డీఆర్వో కె.మోహన్‌కుమార్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి ఈశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

1/5

2/5

3/5

●  గాజులతో అలంకరణ
4/5

● గాజులతో అలంకరణ

5/5

Advertisement
Advertisement