చేసిన మంచిని ప్రజలకు చెబుదాం | Sakshi
Sakshi News home page

చేసిన మంచిని ప్రజలకు చెబుదాం

Published Thu, Nov 9 2023 12:22 AM

- - Sakshi

కొమ్మాది: జిల్లాలో గురువారం నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు తెలిపారు. ఎండాడలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌, మేయర్‌ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ ఉత్తర సమన్వయకర్త కె.కె.రాజుతో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం సమపాళ్లలో జరిగిందన్నారు. గత ప్రభుత్వా లు ఏం చేశాయి.. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించడమే ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై ఆర్‌బీఐ ఇచ్చిన నివేదిక చూస్తే పచ్చ నేతలకు అర్థమవుతుందన్నారు. జీడీపీలో గత ప్రభుత్వంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే.. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9వ స్థానంలోకి ఎగబాకిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమా రు 4 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందన్నారు. పరిశ్రమల అభివృద్ధి పరంగా 2019లో రాష్ట్రం 22వ స్థానంలో ఉంటే.. వైఎస్సార్‌ సీపీ వచ్చిన తర్వాత 3వ స్థానంలోకి చేరిందన్నారు. మైక్రోసాఫ్ట్‌, టీసీఎస్‌, అదానీ వంటి కంపెనీలు ఆంధ్రాలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠాశాలలు కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దామని, ప్రతి పాఠశాలలోనూ ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టామన్నారు. సుమారు 5 లక్షలకు పైగా బైజూస్‌ ట్యాబ్‌లు అందించామని, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు కార్పొరేట్‌ వైద్యం చేరువ చేశామన్నారు. 17 మెడికల్‌ కళాశాలలు, రెండు విమానాశ్రయాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్‌లో మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలోనూ దేశంలో రాష్ట్రం మొదటిస్థానంలో ఉందన్నారు. నాలుగున్నరేళ్లలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. ఇది చూసి ఓర్వలేని పచ్చమీడియా పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మళ్లీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని చెబుదామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దామా సుబ్బారావు, డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, నియోజకవర్గ పరిశీలకులు మొల్లి అప్పారావు, పార్టీ కార్యాలయం ఇన్‌చార్జి రవిరెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు పేర్ల విజయచందర్‌, పిల్లా సుజాత, మాధవీవర్మ, ముఖ్య నాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ్‌ పాల్గొన్నారు.

నేటి నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

కోలా గురువులు

Advertisement
Advertisement