జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీయల్‌ పార్కుకు ప్రోత్సాహకాలు | Sakshi
Sakshi News home page

జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీయల్‌ పార్కుకు ప్రోత్సాహకాలు

Published Fri, Nov 10 2023 4:46 AM

-

విశాఖ విద్య: విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలంలోని జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీయల్‌ పార్కు లిమిటెడ్‌కు పలు రాయితీలను ప్రకటిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎస్‌ఎంఈ పార్కులో అల్యూమినియం రిఫనరీ కాంప్లెక్స్‌ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేలా సంస్థ ముందుకొచ్చింది. రూ.531.36 కోట్లు పెట్టుబడితో 1,166 ఎకరాల్లో ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రభుత్వం ఇది వరకే అనుమతులు ఇచ్చింది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడేలా పెద్దమొత్తంలో పెట్టుబడితో ప్రాజెక్టు నిర్వహణకు ముందుకొచ్చిన నేపథ్యంలో దీనిని ప్రోత్సహించేలా ఇండస్ట్రీయల్‌ డవలెప్‌మెంట్‌ –2023–37 పాలసీ మేరకు రాయితీలను ఇచ్చేలా స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపి, ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను ప్రభుత్వానికి నివేదించింది. వీటిలో కొన్నింటికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇండస్ట్రీయల్‌ పార్కు వరకు విద్యుత్‌, నీటి సరఫరాకు అనుమతి ఇస్తూ, ఇందుకు సంబంధించిన వ్యయాన్ని సంస్థ వెచ్చించాలని సూచించింది. 33 శాతం మించకుండా రెసిడెన్షియల్‌/కమర్షియల్‌ నిర్మాణాలు చేసుకునేలా, అదే విధంగా ఐడీపీ 2023–37 పాలసీ మేరకు ఇతర ప్రోత్సాహకాలు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement