మంత్రి అమర్‌నాథ్‌తో జర్నలిస్టుల సంబరాలు | Sakshi
Sakshi News home page

మంత్రి అమర్‌నాథ్‌తో జర్నలిస్టుల సంబరాలు

Published Sat, Nov 11 2023 12:48 AM

దీపాలతో మంత్రి అమర్‌నాథ్‌, జర్నలిస్ట్‌ సంఘాల నాయకులు - Sakshi

అక్కిరెడ్డిపాలెం: ఆంధ్రప్రదేశ్‌లో వర్కింగ్‌ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై విశాఖలో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. తాజాగా జీవో విడుదలపై మంత్రి అమర్‌నాఽథ్‌ను మిందిలో కలిసి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ పారదర్శక నిర్ణయంతో జర్నలిస్టుల కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. ఈ మేరకు విశాఖలో జర్నలిస్టులు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మంత్రి అమర్‌నాఽథ్‌తో కలిసి బాణసంచా కాల్చా రు. జర్నలిస్టుల కుటుంబాల్లో ఈ ఏడాది ముందుగానే సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి వెలుగులు నింపారని జర్నలిస్టు సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు రావులవలస రామచంద్రరావు ఆధ్వర్యంలో జర్నలిస్టులు మంత్రి అమర్‌నాఽథ్‌ను అభినందించారు. డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌, ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు కామాలుద్ధీన్‌ మౌలానా, ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు నరేష్‌ కిరణ్‌, రమేష్‌ రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. మరో వైపు పాత్రికేయ కుటుంబ సభ్యులకు వారసత్వంగా వచ్చే ఆస్తులను పరిగణలోకి తీసుకోకుండా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు మంత్రి అమర్‌నాథ్‌ను కోరారు.

Advertisement
Advertisement