Sakshi News home page

18న విశాఖ తూర్పులో సాధికార యాత్ర

Published Thu, Nov 16 2023 12:56 AM

సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ వై.వి సుబ్బారెడ్డి - Sakshi

సాక్షి, విశాఖపట్నం/కొమ్మాది: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నుంచి 30వ తేదీ వరకు జరగనున్న రెండో విడత సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార మొదటి విడత బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. అదే ఉత్సాహంతో నరసన్నపేట నుంచి రెండో విడత యాత్ర బుధవారం నుంచి ప్రారంభమైందన్నారు. ఎండాడలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో రెండవ విడత సామాజిక సాధికార యాత్ర ఉత్తరాంధ్ర షెడ్యూల్‌ విడుదల చేశారు. గురువారం రాజాం, 18న విశాఖ తూర్పు, 20న యలమంచిలి, 21న పాతపట్నం, 22న విశాఖ దక్షిణ, 23న బొబ్బిలి, 24న పాలకొండ, 25 పెందుర్తి, 27 ఎచ్చెర్ల, 28న నెల్లిమర్ల, 29న కురుపాం, 30న అరకులోయలో ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నాలుగున్నరేళ్ల వైఎస్సార్‌ సీపీ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు. యాత్రలో భాగంగా నాడు–నేడు పనులను పరిశీలిస్తున్నామని.. ఎక్కడైనా లోపాలుంటే సరిచేయాలని అధికారులకు వివరిస్తున్నామన్నారు. జనసేన నాయకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదన్నారు. నాడు–నేడు ద్వారా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆ పార్టీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా అంతిమ విజయం వైఎస్సార్‌ సీపీదేనన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ సీహెచ్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌, వరుదు కల్యాణి, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్‌, సమన్వయకర్త కె.కె.రాజు, పార్టీ ఉపాధ్యక్షుడు దామా సుబ్బారావు, పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవిరెడ్డి, పేడాడ రమణికుమారి, ద్రోణంరాజు శ్రీవత్సవ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి

విజయవంతం చేయాలని

పార్టీ శ్రేణులకు పిలుపు

Advertisement
Advertisement