Sakshi News home page

సామాజిక న్యాయంలో సరికొత్త ముద్ర

Published Sat, Nov 18 2023 12:26 AM

- - Sakshi

● ‘విశాఖ తూర్పు’లో అత్యధికంగా బీసీలకు పదవులు ● 62 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం ● పదవులు పొందిన వారిలో 32 మంది మహిళలే ● నేటి బస్సు యాత్రకు హాజరుకానున్న మంత్రులు సీదిరి, మేరుగు, రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి

ఏఎస్‌ రాజా గ్రౌండ్‌లో సభ ఏర్పాట్లు

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక న్యాయానికి సరికొత్త నిర్వచనమిచ్చారు. గత ప్రభుత్వాల వలే కాకుండా చేతల్లో చూపించి ఔరా అనిపించారు. ఇందుకు విశాఖ తూర్పు నియోజకవర్గంలో రాజకీయ, నామినేటెడ్‌ పదవుల్లో 62 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశమిచ్చి సమన్యాయం చేయడమే నిదర్శనం. తూర్పు నియోజకవర్గంలో మేయర్‌, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ పదవులను బీసీ యాదవ మహిళలకు, రెండు ఎమ్మెల్సీ పదవులను బీసీలకు కేటాయించి సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు వైఎస్సార్‌సీపీ పెద్దపీట వేసి సరికొత్త చరిత్రను లిఖించింది. అలాగే రెండు కార్పొరేషన్‌ చైర్మన్లు, 20 కార్పొరేషన్‌ డైరెక్టర్లు, ఒక ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌, ముగ్గురు మార్కెట్‌ కమిటీ మెంబర్‌లు, ప్రధాన దేవస్థానాల పాలక మండలి చైర్మన్‌లుగా, సభ్యులుగా, డైరెక్టర్లుగా, 8 మందికి బీసీ కార్పొరేటర్లుగా అవకాశం కల్పించారు. ఇలా రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పదవులు దక్కాయి.

పదవులు పొందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు

● మేయర్‌గా గొలగాని హరివెంకటకుమారి, ఎమ్మెల్సీలుగా వంశీకృష్ణ శ్రీనివాస్‌, వరుదు కల్యాణి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌గా అక్కరమాని విజయనిర్మల, మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌గా పేర్ల విజయచందర్‌, నాగవంశం కార్పొరేషన్‌ చైర్మన్‌గా బొడ్డు అప్పలకొండకు అవకాశం ఇచ్చారు.

● ఏపీఐఐసీ డైరెక్టర్‌గా మొల్లి అప్పారావు, ఏపీ కల్చరల్‌ డైరెక్టర్‌గా దూళి రఘు, ఏపీ యాదవ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా గుంటబోయిన లక్ష్మి, ఏపీ బలిజ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా మద్దుల చాయదేవ్‌, ఏపీ గౌడ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా బలగాని భారత లక్ష్మి, ఏపీ గవర కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా పీలా జోషీలా, ఏపీ నగరాల కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా బయాన మీనాక్షి, వండ్రాసి శ్యామల, ఏపీ రెడ్డిక కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా బోరా సుభాషిణి, అయ్యారక కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా కె.రామన్నపాత్రుడు, నాగవంశం కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా బుగత లిఖిత, ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా వి.వరలక్ష్మి, ఏపీ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా పతివాడ వెంకట లక్ష్మి, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా కారి శ్రీలక్ష్మి, ఏపీ కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా బలిదే పద్మావతి, ఏపీ కల్చరల్‌ డైరెక్టర్‌గా సూరాడ వెంకట లక్ష్మి, ఏపీ ఎయిర్‌పోర్టు కమిటీ డైరెక్టర్‌గా పల్లా దుర్గ, మార్కెట్‌ కమిటీ మెంబర్లుగా ప్రియాంక యావత రెడ్డి, కొచ్చి సుమిత, కనక మహాలక్ష్మి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా సత్యవరపు సతీష్‌, సువ్వాడ శ్రీదేవి–సింహాచలం ట్రస్టీ, ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ డైరెక్టర్‌గా పీతల గోవింద్‌ను నియమించి బీసీలకు పెద్దపీట వేశారు.

● అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి ఏపీ హిస్టరీ అకాడమీ డైరెక్టర్‌గా ఖాదర్‌ సకీనా బేగం, ఏపీ ఫోక్‌ అండ్‌ క్రియేటివిటీ అకాడమీ బోని శివరామకృష్ణ, ఏపీ ఎల్‌ఐడీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఎజ్జెల రాజ కుమారి, ఓసీకి చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ సుబ్రహ్మణ్యం– కనక మహాలక్ష్మీ దేవస్థానం ట్రస్టీగా నామినేటెడ్‌ పదవులు కేటాయించారు.

● జీవీఎంసీ కార్పొరేటర్లుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అక్కరమాని రోహిణి(12వ వార్డు), స్వాతి దాస్‌(9వ వార్డు), కెల్ల సునీత(13వ వార్డు), అప్పారి శ్రీవిద్య(15వ వార్డు), మొల్లి లక్ష్మి (16వ వార్డు), గుడ్ల సత్యారెడ్డి(23వ వార్డు), పల్లా అప్పలకొండ(28వ వార్డు)కు అవకాశం ఇచ్చారు.

● చినవాల్తేరు ఆలయ దేవస్థానం చైర్మన్‌గా కొయ్య గంగాదేవి కాశీ విశ్వేశ్వరరావు, సభ్యులుగా గుర్రాల రాజు, వారధి విజయ్‌, కుప్పిలి చంద్రకళ, కొయ్య ధనలక్ష్మి, దత్తాత్రేయ ప్రభు సాయి(ఓసీ బ్రాహ్మణ)కు పదవులు ఇచ్చారు.

● చినవాల్తేరు జగన్నాథస్వామి ఆలయ చైర్మన్‌గా వారది రాజేష్‌, సభ్యులుగా గుంటబోయిన హరిప్రసాద్‌, కొయ్య సంపత్‌, కోరాడ, గాయత్రి, చెన్నా వరలక్ష్మి(ఎస్సీ)కి అవకాశమిచ్చారు.

● పాండురంగ స్వామి ఆలయ చైర్మన్‌గా మట్టుపల్లి హనుమంతురావు, సభ్యులుగా కె.నరసింహమూర్తి(ఓసీ), రావులపాలెం రాజ్యలక్ష్మి(ఎస్సీ), యర్రా సన్యాసినాయుడు, దారపు విజయలక్ష్మికి పదవులు కేటాయించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీలకు సమ ప్రాధాన్యం కల్పించారు.

● వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులుగా ఎం.పద్మజ(బీసీ), బర్ల మంగరాజు(బీసీ), డి.వెంకటలక్ష్మి(ఎస్సీ)కి అవకాశమిచ్చారు.

నేడు ‘విశాఖ తూర్పు’లో సామాజిక సాధికార బస్సు యాత్ర

వైఎస్సార్‌సీపీ చేపట్టిన రెండో విడత సామాజిక సాధికార బస్సు యాత్ర శనివారం విశాఖ తూర్పు నియోజకవర్గంలో జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మొదటి విడత బస్సుయాత్ర విజయవంతం కావడంతో రెంటించిన ఉత్సాహంతో రెండో విడత యాత్రకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యారు. ఈ యాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గురించి వివరించనున్నారు. అలాగే గత టీడీపీ ప్రభుత్వం పేదలకు చేసిన మోసాన్ని ఎండగట్టనున్నారు.

బస్సు యాత్ర సాగుతుందిలా..

విశాఖ ఎంపీ, వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టనున్న బస్సు యాత్రకు పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, సోషల్‌ వెల్ఫేర్‌ మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్‌, వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు హాజరుకానున్నారు.

ఉదయం 12.30 గంటలకు ఆరిలోవ కాలనీ బస్‌ స్టాప్‌ వద్ద ప్రెస్‌మీట్‌

మధ్యాహ్నం ఒంటి గంటకు క్రిస్టియన్‌ మైనారిటీ ఫంక్షన్‌ హాల్‌ వద్ద విందు

2 గంటలకు ఆరిలోవ కాలనీలోని వైఎస్సార్‌ విగ్రహానికి మంత్రులు నివాళులర్పించిన అంనతరం బస్సుయాత్ర ప్రారంభం

2.30 గంటలకు తోట గరువులోని జెడ్పీహెచ్‌ స్కూల్‌ను సందర్శించనున్న మంత్రులు

2.45 గంటలకు పెదగదిలి జంక్షన్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా బహిరంగ సభ స్థలికి సాగనున్న బస్సుయాత్ర

3.15 గంటలకు ఎంవీపీ కాలనీలోని ఏఎస్‌ రాజా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ ప్రారంభమై సాయంత్రం 4.45 గంటల వరకూ జరగనుంది.

బస్సుయాత్ర విజయవంతం చేయాలి

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనలో చేసిన సామాజిక సాధికారతను ప్రజలకు వివరించేందుకు చేపడుతున్న బస్సుయాత్రను విజయవంతం చేయాలి. సాధికారతకు సీఎం సరికొత్త అర్థం చెప్పారు. విశాఖలోనే అత్యధికంగా తూర్పు నియోజకవర్గంలో నామినేటెడ్‌ పదవులు, రాజకీయ పదవులు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ఈ యాత్రకు తరలిరావాలి. బైక్‌ ర్యాలీలతో బస్సు యాత్రకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు.

– ఎంవీవీ సత్యనారాయణ, ఎంపీ,

వైఎస్సార్‌సీపీ తూర్పు సమన్వయకర్త

తరలిరండి

తూర్పు నియోజకవర్గంలో తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు తరలిరావాలి. మేయర్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పరిశీలకులతో పాటు పార్టీ ముఖ్య నాయకులు హాజరై దిగ్విజయం చేయాలి.

– కోలా గురువులు,

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

Advertisement

తప్పక చదవండి

Advertisement