ఆర్జిత సేవలు పునరుద్ధరణ | Sakshi
Sakshi News home page

ఆర్జిత సేవలు పునరుద్ధరణ

Published Sat, Nov 18 2023 12:26 AM

జీలకర్ర బెల్లం ఘట్టాన్ని నిర్వహిస్తున్న అర్చకుడు - Sakshi

సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆర్జిత సేవలను శుక్రవారం నుంచి తిరిగి పునరుద్ధరించారు. తిరునక్షత్రం పూజలు సందర్భంగా ఈనెల 12నుంచి 16వతేదీ వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. తిరునక్షత్రం పూజలు ముగియడంతో తిరిగి యథావిధిగా ఆర్జిత సేవలు పునరుద్ధరించారు. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలోని మండపంలో వేంజేంపజేశారు. విష్వక్సేణపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, సంకల్పం, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని అర్చకులు అందజేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement