యువతకు సంగీతం కోర్సుల్లో అత్యుత్తమ శిక్షణ | Sakshi
Sakshi News home page

యువతకు సంగీతం కోర్సుల్లో అత్యుత్తమ శిక్షణ

Published Sat, Nov 18 2023 12:26 AM

కేక్‌ కట్‌చేస్తున్న ఏయూ వీసీ ప్రసాదరెడ్డి - Sakshi

ఏయూక్యాంపస్‌: మానసిక ప్రశాంతతకు సంగీతం దోహదపడుతుందని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి అన్నారు. ఏయూ–సెయింట్‌ లూక్స్‌ ఆడియో ఇంజినీరింగ్‌–మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ విభాగంలో శుక్రవారం నాక్‌ విజయోత్సవం, సెయింట్‌ లూక్స్‌ స్టూడియో ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ కేక్‌ కట్‌చేసి, నూతనంగా అభివృద్ధి చేసిన కంప్యూటర్‌, ఆడియో, వీడియో ఎడిటింగ్‌ ల్యాబ్‌లను పరిశీలించారు. ఏయూ నాక్‌ ఏ ప్లస్‌ ప్లస్‌, 3.74 సీజీపీఏ సాధించడంపై సెయింట్‌ లూక్స్‌ సంస్థల నిర్వాహకులు ఆశీర్వాద్‌ లూక్‌, ప్రీతం లూక్‌ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement