Sakshi News home page

పోలీసు సిబ్బందికి సీపీ అభినందనలు

Published Tue, Nov 21 2023 1:10 AM

ఎస్‌ఐ కొండను అభినందిస్తున్న సీపీ రవిశంకర్‌  - Sakshi

అల్లిపురం: ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదంపై సకాలంలో స్పందించి, ఆస్తి నష్టం జరగకుండా విధులు నిర్వహించిన పోలీస్‌ సిబ్బందిని పోలీస్‌ పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ అభినందించి, రివార్డులు అందజేశారు. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో క్రైం బీట్‌ గస్తీ తిరుగుతున్న హెడ్‌ కానిస్టేబుల్‌ జి.నాగేంద్రకుమార్‌, కానిస్టేబుల్‌ వీజీజీబీ రామకృష్ణలు ఫిషింగ్‌ హార్బర్‌లో పొగలు రావడాన్ని గమనించారు. వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందజేయగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ ఆర్‌.ఎ.కొండ, కానిస్టేబుల్‌ సీహెచ్‌.గంగాధర్‌లు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. వెంటనే ఐదు అగ్నిమాపక శకటాలు, కోరమాండల్‌, పోర్టు, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలకు సమాచారం అందజేయటంతో సకాలంలో చేరుకుని మంటలను అదుపుచేయటంతో ఆస్తి నష్టం తగ్గింది. విధుల్లో చాకచక్యంగా వ్యవహరించిన వీరిని సీపీ అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement