21 ఆటోలు, 2 బస్సులపై కేసులు | Sakshi
Sakshi News home page

21 ఆటోలు, 2 బస్సులపై కేసులు

Published Thu, Nov 30 2023 1:10 AM

ఆటో డ్రైవర్లకు రహదారి భద్యతపై అవగాహన కల్పిస్తున్న రవాణా శాఖాధికారి - Sakshi

గోపాలపట్నం: స్కూల్‌ ఆటోలపై రవాణా శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న ఆటోలపై కేసులు నమోదు చేస్తున్నారు. బుధవారం తగరపువలస, ఆనందపురం, అగనంపూడి, గాజువాక ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో 21 ఆటోలు, 2 స్కూల్‌ బస్సుపై కేసులు నమోదు చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు నగరంలో పలు చోట్ల చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో 151 ఆటోలపై కేసులు నమోదు చేసినట్లు ఉపరవాణా కమిషనర్‌ రాజారత్నం తెలిపారు. తగరపువలస, ఆనందపురం ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లకు అధికారులు అవగాహన కల్పించారు. నిబంధనల ప్రకారం రహదారులపై ఆటోలను నడుపుతామని వారి చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమాల్లో మోటారు వాహన తనిఖీ అధికారులు ఐ.వేణుగోపాలరావు, బాలాజీరావు, రాజారావు, శిరీష, శిరీషాదేవి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement