ప్రాంతీయ నేత్ర వైద్యశాలకు హెచ్‌పీసీఎల్‌ సాయం | Sakshi
Sakshi News home page

ప్రాంతీయ నేత్ర వైద్యశాలకు హెచ్‌పీసీఎల్‌ సాయం

Published Sat, Dec 2 2023 1:08 AM

-

రూ.1.22 కోట్ల వైద్య

పరికరాల అందజేతకు అంగీకారం

మహారాణిపేట: సామాజిక బాధ్యతలో భాగంగా హెచ్‌పీసీఎల్‌ యాజమాన్యం ప్రాంతీయ నేత్ర వైద్యశాలకు రూ.1.22 కోట్ల విలువైన వైద్య పరికరాలు అందించేందుకు అంగీకారం తెలిపింది. ఇందుకు సంబంధించి హెచ్‌పీసీఎల్‌, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున మధ్య శుక్రవారం ఎంవోయూ జరిగింది. హెచ్‌పీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.రతాబ్రాజ్‌, ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఆస్పత్రి పర్యవేక్షకురాలు డాక్టర్‌ పి.విశ్వమిత్ర ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ పి.విశ్వమిత్ర హెచ్‌పీసీఎల్‌ యాజమాన్యానికి, కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు వైద్యులు, హెచ్‌పీసీఎల్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement